ప్రస్తుతం థియేటర్ మార్కెట్ స్లంప్ లో వుంది. భారీ సినిమాలు అన్నీ పస్ట్ హాఫ్ లోనే విడుదలైపోయాయి. కాస్త పెద్ద సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు మిగిలాయి. దాంతో పరిస్థితి ఏమంత బాగాలేదు.
ఇలాంటి టైమ్ లో రామ్-లింగుస్వామి వారియర్ సినిమా వచ్చింది. దానిని టాలీవుడ్ ఇండస్ట్రీ టెస్టింగ్ గ్రౌండ్ గా చూసింది. కానీ సినిమా అంత ఆశాజనకంగా లేదు. దీంతో ఇప్పుడు రాబోయే సినిమాల మీద దృష్టి పెడుతోంది.
చైతన్య థాంక్యూ, రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, దుల్కర్ సల్మాన్ సీతారామం, కళ్యాణ్ రామ్ బింబిసార, నిఖిల్ కార్తికేయ 2 వస్తున్నాయి. ఇవన్నీ అంతగా ఎదురు చూస్తున్న సినిమాల జాబితాలో అయితే లేవు అన్నది వాస్తవం. సినిమా విడుదలయిన తరువాత మౌత్ టాక్ ను బట్టి వుంటుంది పరిస్థితి.
వీటి తరువాత పూరి జగన్నాధ్ లైగర్ వస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత వస్తున్న సినిమా కాబట్టి కాస్త హోప్ వుంటుంది. ఆ తరువాత మెగాస్టార్ గాడ్ ఫాదర్ వచ్చే వరకు అన్నీ మిడ్ రేంజ్ సినిమాలే. గాడ్ ఫాదర్ తరువాత మళ్లీ గ్యాప్ నే. బాలయ్య సినిమా జై బాలయ్య రావాల్సి వుంటుంది అప్పుడు. అది అయిపోతే సంక్రాంతి వరకు మళ్లీ స్లంప్ నే అనుకోవాలి.
పెద్ద హీరోల సినిమాలు అన్నీ నిర్మాణంలో వున్నాయి. అవన్నీ పూర్తయిన తరువాత మళ్లీ థియేటర్లకు కళ వస్తుందేమో?