వైసీపీపై డ్రగ్స్ బురద.. ఎంతకీ తేలదెందుకు?

ఎన్నికలు అయ్యాయి. వైసీపీ ఓడిపోయింది. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కంటైనర్ గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు

డ్రగ్స్ అంటే అవి ఎలా అక్రమ రవాణా అవుతాయో మనం సినిమాలలో చూస్తూ ఉంటాం. డ్రగ్ ను చిన్న చిన్న క్యాప్సూల్స్ లాగా తయారు చేసుకుని కడుపులోకి మింగి విదేశాలకు వెళ్లిన తరువాత వాటిని అవసరమైతే సర్జరీ కూడా చేసి బయటకు తీసి విక్రయించే స్మగ్లింగ్ వ్యవహారాలను మనం సినిమాలలో చూశాం. అంతే తప్ప కంటైనర్లలో ఒక దేశం నుంచి మరో దేశానికి డ్రగ్స్ ఏదో సరుకులు పంపినంత సులభంగా పంపేస్తారనేది మన ఊహకు అందని సంగతి.

విశాఖపట్నం పోర్టుకు ఒక కంటైనర్ వస్తే, ఆ కంటైనర్లో డ్రగ్స్ వచ్చాయని, అవన్నీ ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచిపెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెప్పించారని పుకారు పుట్టించడం అనూహ్యమైన సంగతి. అలాంటి పుకారును పుట్టించడంలో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలకు ముందు చాలా సఫలవంతమైన వ్యూహాన్ని అనుసరించింది. వైసీపీ మీద బురద చల్లి రాష్ట్రవ్యాప్తంగా గొప్ప మేలేజీ సాధించింది.

విశాఖ పోర్టుకు ఒక కంటైనర్ బ్రెజిల్ నుంచి వచ్చింది. సంధ్యా ఆక్వా అనే కంపెనీ వారు రొయ్యల మేత కోసం తెప్పించిన కంటైనర్ అది. కంటైనర్ విశాఖపట్నం రాగానే సిబిఐ అధికారులు వాలి, ఒక్కసారిగా దానిని సీజ్ చేసి నానా హడావుడి సృష్టించారు. అందులో డ్రగ్స్ ఉన్నాయని ప్రకటించారు. అలాంటి కంటైనర్లు ఆ ఆక్వా కంపెనీకి తరచుగా వస్తుంటాయని స్థానిక అధికారులు చెప్పినా పట్టించుకోలేదు.

వైసిపి నాయకులే డ్రగ్స్ దిగుమతి చేసినట్లుగా ప్రచారాన్ని తెలుగుదేశం వారు మొదలుపెట్టారు. సంధ్యా కంపెనీ యజమాని బిజెపి నాయకురాలికి బంధువు అనే ప్రచారాన్ని వైసీపీ చేసింది. ఇలా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నారు గాని వైసీపీ మీద బురద చల్లిన ప్రయత్నం ఎక్కువగా వైరల్ అయింది. ఓటర్లు అందరికీ డ్రగ్స్ పంచడానికి విదేశాల నుంచి కంటైనర్ లో తెప్పించారంటూ బీభత్స ప్రచారం నిర్వహించారు.

ఎన్నికలు అయ్యాయి. వైసీపీ ఓడిపోయింది. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కంటైనర్ గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. స్థానికంగా పరీక్షలు చేస్తే అవి డ్రగ్స్ కాదని తేలింది. ఆ పరీక్షల్లో కూడా లోపం ఉంటుందంటూ మొత్తం సిబిఐ లాబరేటరీ లకు ఢిల్లీ పంపారు. నాలుగైదు నెలలుగా వారు ఏ సంగతి తేల్చడం లేదు. అందులో డ్రగ్స్ ఉన్నాయో లేదో నివేదిక కూడా రాలేదు.

విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అది కేవలం రొయ్యల మేత మాత్రమే అని అంటున్నారు. కేవలం సంధ్యా ఆక్వా వ్యాపార ప్రత్యర్థులు ఆ కంపెనీ క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి సిబిఐ ఇలాంటి సంస్థకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చి ఈ హడావుడి సృష్టించారని చెబుతున్నారు. అంత బీభత్సం చేసిన తర్వాత తమ దర్యాప్తు తప్పని చెప్పుకోవడానికి సిబిఐ మొహమాటపడుతున్నదేమో గాని ఆ కంటైనర్ను విడుదల చేయడానికి పూనుకోవడం లేదు- అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.

కేవలం రాజకీయ అవసరం కోసం తెలుగుదేశం ఇలాంటి ప్రచారాన్ని ఉద్దేశపూర్వకంగా సృష్టించిందా అనే అభిప్రాయం కూడా అందరికీ కలుగుతోంది.

26 Replies to “వైసీపీపై డ్రగ్స్ బురద.. ఎంతకీ తేలదెందుకు?”

  1. it’s easy to catch criminals when the crime is fresh , why didn’t YCP govt caught the culprits at that time? it’s more time passed in earlier govt, this govt formed not even two months now, what you expect miracles in these two months ??

  2. ముందు నమ్మలేదు – మన వాళ్ళు వెధవ వేషాలు వేస్తారు గానీ – ఇంత దిగజారిపోతారు అని అప్పుడే అనుకోలేదు – విశాఖ లో జరిగిన భూ కబ్జాలు – ఆ అశ్లీలత చూస్తూ ఉంటే – డబ్బులు కోసం ఇటువంటి పనులు ఎందుకు చేయరు అన్న అనుమానం ఉంది.

  3. ఉద్దేశపూర్వకంగా చేసిఉంటే ముమ్మాటికీ తప్పే…..

    మరి పింక్ డైమండ్ ను గత ఐదు సంవత్సరాలలొ వెనక్కి తెప్పించినట్లున్నారు……..

  4. మనం మాత్రం తక్కువవేంటి పురందరేశ్వరి బందువని, అసలు వాళ్ళు టీడీపీ వాళ్ళు అని రాయలేదా? వ్యక్తి అయినా వ్యవస్థ అయినా పార్టీ అయిన ఒక ఎత్తుకి వెళ్లిపోయాక ఎవ్వరు ఏమి చెయ్య లేరు అలాగే TDP అనేది ఒక ఎత్తుకి ఎదిగిన పార్టీ దానికి మకిలి అంతించాలి అనుకోవటం మూర్కత్వం..మనం గాలికి గెలిచి పార్టీని ఎత్తుకుని తీసుకు వెళ్లకుండా గాలికి వదిలేసి ఎకాకి గా మిగిలి..ఇక్కడ వరకు తెచ్చుకున్నాం…చూస్తూ ఉండు ఇంకా మన పార్టీ పేరు చెప్తే జనాలు నవ్వటం స్టార్ట్ చేస్తారు త్వరగా…

    ఏమి GA కామెడీ గా మిగిలిపోయాం

  5. Jeggul అనే గా0డు గాడి గంజాయి బానిసల పనే ఇది.. Bangalore పారిపోయిన వాణ్ణి denకొచ్చి vongobetti వాయి0చాలి

  6. ఈ కేxxసు తేల్చే సరైన మొనగాళ్లు lera ఈ govt. lo? అంత విమర్శలు to కాలం గడుపుతున్నారు.

  7. నిజంగా డ్రగ్స్ అయితే ఆ పాపం లో అన్ని పార్టీలకి భాగస్వామ్యం ఉండి ఉండాలి… అందుకే ఎవరూ మాట్లాడడం లేదు..

  8. అవి టీడీపీ వాళ్ళకి సంబంధించినవి అని రాసింది నువ్వు, ఆ bulugu బ్యాచ్ కదా?

  9. డబ్బు కోసం పల్లెటూర్లో పిల్లలకు కూడా గంజాయి అలవాటు చేసి కోట్లు సంపాదించిన ప్యాలస్ పులకేశి. ఆ విషానికి చివరికి ఫ్యాన్ పార్టీ వాళ్ళ పిల్లలు కూడా బలయ్యారు.

    1. ఆ డబ్బుతో వాడు ప్యాలస్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. తల్లి తండ్రులు మాత్రం భవిష్యత్తు పోయిన తమ పిల్లలని చూసి భదపడు తున్నారు

    2. Ganjayi peddha drug kaadhu. Asalu danini illegal chesindhe US government pressure tho. Migithavi athyantha pramadakaram. Meth, Cocaine lantivi. Avanni Pinnama company tho sambandham unna valle teppisthunnaru anedhi talk.

      1. కొంపదీసి తమరు ప్యాలస్ పులకేశి కి గంజయి సరఫరా అతను కాదు కదా,

        ఏమో నయన, గంజాయి మంచిదా ?

        స్కూల్ కి వెళ్ళే పిల్లలకి గంజాయి అలవాటై ఏమో అవుతుందో తెలుసా ?

        వాళ్ళ జీవితమే చంక నాకి పోతుంది

  10. అంటే..అది..అది మీకర్థం కావడం లేదు..రొయ్యలకు డ్రగ్స్ ఫీడ్ వేసి,జనానికి అలవాటు చెయ్యాలనే ప్లాన్.అహ్హ..అహ్హ..

  11. ఆ కథ నే చదివాను.. జెర్మనీ నిఘా సంస్థ ఇండియా లోని నిఘా విభాగానికి తెలియజేసిందని వాళ్ళు సిబిఐ ను పంపారని రాసారు.. మరి అదంతా అబద్ధమేనా? జర్మనీ ఎలా బోల్తా పడింది రొయ్యల మేత కనిపెట్టలేక పోయిఇంద? లేక .. బీజేపీ ప్రభుత్వం అండతో ఆ ఎద్దు మొఖం బీజేపీ అధ్యక్షురాలు ఆ బొల్లి గాడు కలిసి.. చివరకు డ్రగ్స్ ను కేవలం ఆక్వా ఫీడ్ చేసిపారేసార? ఎన్నెన్ని లీలలు ర.. ఆ కమ్మ B0 గ @M గాళ్ళవి?

  12. 1) ఈఏడాది అమ్మఒడి ఇవ్వలేము : లోకేష్

    2) ఖజానాలో డబ్బు లేదు అమరావతి కట్టలేం: నారాయణ

    3) ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు : నాదెండ్ల మనోహర్

    4) ఆరోగ్యశ్రీ ఇవ్వలేం ఆయష్మాన్ భారత్ కార్డు తెచ్చుకోండి: పెమ్మసాని

    5) ఫ్రీ ఇసుక ఇవ్వలేము టన్నుకు 1200 కట్టాల్సిందే : చంద్రబాబు

    6) మా సూపర్ సిక్స్ హామీలు చూస్తేనే నాకు భయమేస్తుంది, హామీలు అమలు చేయలేను : చంద్రబాబు

    7) ప్రతి మహిళకు నెలకు 1500 ఊసే లేదు

    8) ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు శాంతిభద్రతల్లో దారుణంగా ఫెయిల్ అయ్యారు

    9) సంపద సృష్టి పక్కన పెడితే .. ఇప్పటి వరకు మొదలయిన 4 పోర్టులు,17 మెడికల్ కాలేజీల పనులు ఆగిపోయాయి

    10) ఒక్క పథకం ఇవ్వలేదు కానీ .. 32 వేల కోట్లు అప్పులు మాత్రం చేశారు.

    11) నాడు నేడు ఆగిపోయింది,ఐబీ సిలబస్ రద్దు ట్యాబ్ లు ఇస్తే విద్యార్థులు చెడిపోతారని పచ్చ మీడియాలో వక్ర కథనాలు

    ఐపాయ.. 50 రోజుల్లోనే చేతులెత్తేశారు

  13. విశాఖ డ్రగ్ వ్యవహారంలో ..గట్టిగా ఉలిక్కి పడ్డ పచ్చ బ్యాచ్‌

    కొత్త రాజకీయ పొత్తుల నేపథ్యంలో దర్యాప్తు సంస్థపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు..ఉండవని విశ్వసించవచ్చునా…?

    ఈ ప్రశ్నతోపాటు మరికొన్ని సందేహాలకు కూడా సమాధానాలు రావాల్సి ఉన్నది.

    దాణా ఉత్పత్తి ప్రారంభం కాకముందే సంధ్యా సంస్థ 25 వేల కిలోల యీస్ట్‌కు ఎందుకు ఇండెంట్ పెట్టింది..?

    యీస్ట్‌ దిగుమతికి ప్రత్యామ్నాయాలు ఉండగా..అది బ్రెజిల్‌నే ఎందుకు ఎంపిక చేసుకుంది..?

    బ్రెజిల్ నుంచి బయల్దేరిన ఓడ..విశాఖ రావడానికి ఎక్కువ సమయం తీసుకున్నదన్న పాయింట్‌ను కంపెనీ ప్రతినిధులు సీబీఐ ముందు ఎందుకు నొక్కి చెబుతున్నారు..?

    మధ్యలో తమకు తెలియకుండా ఎవరో..ఈ డ్రగ్స్‌ను బాక్స్‌ల్లో పెట్టి ఉంటారని..బుకాయించడం కోసమా…?

    అలా మధ్యలో దూర్చడం సాంకేతికంగా సాధ్యమవుతుందా…?

    విచారణ తర్వాత డ్రగ్స్‌ను తెప్పించడం వెనుక..బాధ్యత సంధ్య కంపెనీదే అని తేలితే..ఆ కంపెనీ ఎందుకు ఆ పని చేసినట్టు..?

    సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ స్వయంగా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగిందా…?

    లేక.. ఎవరికైనా కమీషన్ మీద ఈ పని అప్పగించారా…?

    రెగ్యులర్‌గా దిగుమతులు చేసుకునే కంపెనీలతో… డ్రగ్స్ వ్యాపారులు కమీషన్ ఒప్పందాలు, చేసుకునే అవకాశముంది. కానీ.. సంధ్యా కంపెనీ దాణా ఉత్పత్తిని ఇంకా ప్రారంభించనే లేదు.

    దాణా ఉత్పత్తిని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నట్లు .. ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా అథారిటికీ ఎటువంటి సమాచారం ఇవ్వనేలేదు. దాణా ఉత్పత్తి ప్రారంభించకుండానే..యీస్ట్ దిగుమతికి ఎందుకు..తొందరపడినట్లు….?

    డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నవారు కాకుండా..మరేదో బలమైన శక్తి ప్రోద్భలం మేరకే..సంధ్య కంపెనీ యీస్ట్ కంపెనీకి ఆర్డర్ చేసిందా..?

    బ్రెజిల్ నుంచే దిగుమతి చేసుకోవాలని ఆ శక్తి నిర్దేశించిందా…?

    టీడీపీ, జనసేనకు బీజేపీతో పొత్తు కుదురుతుందనే నమ్మకం కలిగాకే..బ్రెజిల్‌లో బయల్దేరిన ఓడ..పొత్తు కుదిరాక విశాఖ తీరం చేరుకోవడం కాకతాళీయమేనా…?

    డ్రగ్స్ సరఫరా, పంపిణీ వ్యాపారులతో ఒప్పందాలు చేసుకోవడం మనీ లాండరింగ్‌లో కొత్త పద్ధతిగా మారిందా..?

    ఒకేసారి వందలు, వేల కోట్ల రూపాయలను చేతులు మార్చడంలో సంప్రదాయ హవాలా పద్ధతుల కన్నా ఇది మెరుగైన పద్ధతిగా భావిస్తున్నారా…?

    ఎందుకంటే..ఇండియాలో డ్రగ్స్ దందా టర్నోవర్‌..లక్ష కోట్లు దాటిందని నిపుణులు అంచనా వేస్తున్నారు

    2022 జూన్ నుంచి 2023 జులై 15 వరకు.. నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో..రాష్ట్ర బృందాలు కలిసి..సుమారు రూ.12 వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ధ్వంసం చేశాయి.

    ఇంతకు కనీసం పది రెట్లు ఎక్కువ..వినిమయం దేశంలో ఉన్నట్లు భావిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్‌కు ఇదో మార్గంగా పరిగణిస్తూ ఉండవచ్చు.

    అయితే..బలమైన నెట్ వర్క్ ఉన్నవారే ఈ పద్ధతిని అనుసరించే అవకాశమున్నది.

    పక్కా ప్లాన్‌తోనే.. పక్కా నెట్ వర్క్‌తోనే.. యీస్ట్‌లో డ్రగ్స్‌ కలిపి సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌..

    రాష్ట్రాన్నే కాదు.. దేశాన్నే మత్తులో ముంచేయాలనుకుంది.

    కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు సీబీఐ విచారణ సజావుగా సాగేలా సహకరిస్తారా..?

    పొత్తులో భాగంగా డ్రగ్స్‌ దందాను తొక్కేస్తారా..? వేచి చూడాలి.

Comments are closed.