చానెళ్లు ఎలా బతుకుతున్నాయి మరి?

వైకాపా ఎంపీ విజ‌యసాయి రెడ్డి ఛానెల్ పెడతా అనే సరికి, కొన్ని మీడియా సంస్థలు లెక్కలు బయటకు తీస్తున్నాయి. నెలకు ఇన్ని పదుల కోట్లు కావాలి. ఏడాదికి ఇన్ని వందల కోట్లు కావాలి.. అయిదేళ్ల…

వైకాపా ఎంపీ విజ‌యసాయి రెడ్డి ఛానెల్ పెడతా అనే సరికి, కొన్ని మీడియా సంస్థలు లెక్కలు బయటకు తీస్తున్నాయి. నెలకు ఇన్ని పదుల కోట్లు కావాలి. ఏడాదికి ఇన్ని వందల కోట్లు కావాలి.. అయిదేళ్ల పాటు నిర్వహించాలంటే ఇంకా ఇన్ని వందల కోట్లు కావాలి అంటూ. నిజ‌మే. ఇదేమీ అతిశయోక్తి కాదు. మీడియా సంస్థలు నిర్వహించడం అంటే మాటలు కాదు. అది ప్రింట్ మీడియా అయినా విజువల్ మీడియా అయినా. నిర్వహణ ఖర్చులు చాలా ఎక్కువ. కేవలం యూ ట్యూబ్ మీద రన్ చేద్దామనుకున్నా కూడా నిర్వహణ ఖర్చులు మామూలే.

అయితే విజ‌యసాయి రెడ్డి ఛానెల్ పెడతా అన్నపుడే ఈ లెక్కలు ఎందుకు కడుతున్నారు. ఇప్పటికే చాలా అంటే చాలా ఛానెళ్లు వున్నాయి. తెలుగులో వున్నన్ని న్యూస్ ఛానెళ్లు ఎక్కుడా వుండవంటారు. వీటిలో ప్రధానమైనవి మూడు నాలుగు మాత్రమే. వాటికే కాస్త ఇన్ కమ్ అన్నది వుంది. మిగిలిన వాటికి దాదాపుగా జీరో. మరి అవి ఎలా రన్ అవుతున్నాయి అన్న ప్రశ్న ఎప్పుడూ వేయలేదేం. ఎలా ఇన్ని వందల కోట్లు తెస్తున్నారు అని ఎప్పుడూ వ్యాసాలు వండి వార్చలేదేం?

ఇప్పుడు వున్న ఎన్నో ఛానెళ్లు ఎలా నిర్వహిస్తున్నారో వారికే ఎరుక. ఎన్ని కష్టాలు పడుతున్నారో వారికే తెలుసు. ప్రతి నెల ఎప్పుడో ఒకప్పుడు జీతాలు ఎలా ఇస్తున్నారో అలాంటి ఛానెళ్ల యాజ‌మాన్యాలకే అర్థమయ్యే సంగతి. అందువల్ల ఖర్చు సంగతి గుర్తు చేసి విజ‌యసాయిని భయపెట్టాల్సిన పని అయితే లేదు. ఇప్పుడున్న ఛానెళ్లు ఏ మార్గంలో సంపాదిస్తున్నాయో, విజ‌యసాయి ఛానెల్ కూడా అదే మార్గంలో వెళ్తుందేమో? ఎందుకంటే ఛానెల్ అధినేత విజ‌యసాయి కానీ, పని చేసే వారంతా ఏదో ఛానెల్ లోంచి వచ్చి చేరే వారే కదా.

చాలా వరకు ఛానెళ్లు జిల్లా రిపోర్టర్లకు పెద్దగా జీతాలు ఇవ్వవు. వాళ్లు కూడా అడగడం తక్కువ. ఐడి కార్డ్, అక్రిడేషన్ ఇస్తే చాలు, తమ కెమేరాతోనే పని చేస్తాం అనేవారి సంఖ్య తక్కువేమీ కాదు. ఎందుకు అలా అన్నది వారికే తెలియాలి. అందువల్ల ఇప్పుడు విజ‌యసాయి రెడ్టి పెట్టినా అలాంటి వారిని తీసుకోరు అని గ్యారంటీ లేదు.

ఇక ఎక్విప్ మెంట్ అన్నది వన్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్. ఎటొచ్చీ, భవనం అద్దె, కరెంట్ బిల్లులు, ఏడిటోరియల్ అండ్ టెక్నికల్ స్టాఫ్ ఖర్చు తప్పదు. వీళ్లందరికీ ఇచ్చే జీతాలు అంతంత మాత్రమే. ప్రధాన ఛానెళ్లు తప్పితే ఏ ఛానెల్ అయినా ఇదే పరిస్థితి.

ఈ లెక్కలు అన్నీ విజ‌యసాయికి తెలియనవి కావు. పిఎఫ్ లు, ఈపిఎఫ్ లు, డిఎ లు, ప్రభుత్వం నిర్దేశించిన జీతాలు అన్నవి ఎప్పుడో గాలికిపోయాయి. కన్సాలిడేటెడ్ శాలరీలు, లాస్ట్ మినిట్ లో చెప్పి బయటకు పంపేయడం అన్నది ఇప్పుడు మీడియా సంస్థల్లో కామన్ అయిపోయంది.

విజ‌యసాయి లాంటి వాళ్లకు వన్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్ పెద్ద సమస్య కాదు. స్వంత భవనం అన్నది ఎక్కడో ఒక దగ్గర వుండనే వుంటుంది. అందువల్ల అలా అలా వీలయినంత తక్కువగా నిర్వహించుకుంటూ వెళ్లిపోతారు. అందువల్ల విజ‌యసాయి ఎలా ఇబ్బంది పడతారో అన్న టెన్షన్ మిగిలిన మీడియాలకు అనవసరం ఏమో?

26 Replies to “చానెళ్లు ఎలా బతుకుతున్నాయి మరి?”

  1. Greatandhra లో విసాయి పెట్టుబడులు పెడతాడేమో, అపుడు ఈ విషపు జర్నలిజం మహా విష వృక్షం అవ్వచ్చు. అందుకేనా తాత మాటలకు బజంత్రీలు వాయిస్తున్నాడు?

  2. ఈ ఎడ్డీ గాడి ముడ్డి పగలగొట్టిన సిగ్గు లేదు, అస్సలు చెడ్డి వేసుకోడు.

  3. ఈ ఎడ్డీ_గాడి ముడ్డి_పగలగొట్టిన సిగ్గు_లేదు, అస్సలు చెడ్డి_వేసుకోడు.

  4. 60 weeks ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఫ్రీ కోర్సు పూర్తిగా తెలుగులో.

    ఇంట్రెస్ట్ ఉన్నవారు, మా యూట్యూబ్ ఛానెల్ ఫాలో అవ్వండి

    YouTube లో

    Cloud Computing in Telugu

    అని సెర్చ్ చెయ్యండి

  5. ఈగ కూడా వాలనివ్వవుగా మీ వాళ్ల మీద. అలాగే ఆ వైజాగ్ మేడమ్ గారి బిడ్డకు తండ్రెవరో కనుక్కుని వార్త రాయ కూడదూ. జనాలు తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు.

  6. “ఖర్చు సంగతి గుర్తు చేసి విజ‌యసాయిని భయపెట్టాల్సిన పని అయితే లేదు” baaga sampadincharu 5 years lo .

Comments are closed.