పుష్ప 2 – సుకుమార్ దే భారం

టాలీవుడ్ లో టాక్ అంతా పుష్ప 2 సినిమా మీదనే. అనుకున్నట్లు వస్తుందా? రాదా? ఇంకెంత వర్క్ వుంది. టైమ్ సరపోతుందా? మరో పాట ఎప్పుడు విడుదల చేస్తారు? ఇలా రకరకాల క్వశ్చన్లు. ఇండస్ట్రీ…

టాలీవుడ్ లో టాక్ అంతా పుష్ప 2 సినిమా మీదనే. అనుకున్నట్లు వస్తుందా? రాదా? ఇంకెంత వర్క్ వుంది. టైమ్ సరపోతుందా? మరో పాట ఎప్పుడు విడుదల చేస్తారు? ఇలా రకరకాల క్వశ్చన్లు. ఇండస్ట్రీ జ‌నాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మరో 35 నుంచి 40 రోజుల షూట్ బకాయి వుంది. బన్నీ చేయాల్సినది వుంది.. ఫాజిల్ చేయాల్సింది వుంది. సినిమా లెక్కల ప్రకారం 40 రోజుల షూట్ అంటే 60 నుంచి 80 రోజులు పడుతుంది. ఎందుకంటే కాల్ షీట్ల అడ్జ‌స్ట్ మెంట్లు, గ్యాప్ లు వుంటాయి కనుక.

ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ ను లాక్ చేసే పనిలో వున్నారు సుకుమార్ అని తెలుస్తోంది. అగస్టు నెలాఖారులోగా ఫస్ట్ హాఫ్ లాక్ చేసి ఇస్తారని తెలుస్తోంది. అక్కడికి 90 రోజుల టైమ్ వుంటుంది. షూటింగ్ పూర్తి చేయడానికి, సెకండాఫ్ లాక్ చేయడానికి. సుకుమార్ సినిమా కనుక దేవీ కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకుని నేపథ్య సంగీతం అందించాల్సి వుంటుంది. సెప్టెంబర్ లో తొలిసగానికి సంగీతం సమకూరిస్తే, నవంబర్ లో మలి సగానికి సమకూర్చే అవకాశం వుంది.

అందువల్ల ఎలా చూసినా నవంబర్ నెలాఖరుకు వర్క్ పూర్తయ్యే అవకాశాలే ఎక్కువ వున్నాయి. ఎటొచ్చీ కీలక నటులు, బన్నీ, ఫాజిల్ కోపరేట్ చేస్తే చాలు. దర్శకుడు సుకుమార్ తన సహజ‌మైన వర్కింగ్ స్టయిల్ ను పక్కన పెట్టి కాస్త స్పీడప్ చేస్తే ఇంకా సూపర్.

కానీ పుష్ప వన్ కు మాదిరిగానే ఈసారి కూడా దర్శకుడు సుకుమార్ ప్రీ రిలీజ్ పబ్లిసిటీలో ఎక్కడా కూడా కనిపించే అవకాశం వుండదు. పబ్లిసిటీ మొత్తాన్ని హీరో బన్నీనే తన భుజాల మీద వేసుకోవాల్సి వుంటుంది. ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు, కేరళ, తమిళనాడు, ఇలా అన్ని చోట్ల పబ్లిసిటీకి కనీసం 15 నుంచి 30 రోజులు అవసరం పడతాయి. అలా చేయాలంటే అక్టోబర్ చివరి నాటికి బన్నీ కి మరే సినిమా బాధ్యతలు వుండకూడదు.

మొత్తానికి పుష్ప 2 డిసెంబర్ విడుదల అన్నది పాజిబుల్ నే. కానీ అది సుకుమార్ బలంగా తలుచుకుంటనే సాధ్యం.

7 Replies to “పుష్ప 2 – సుకుమార్ దే భారం”

  1. 60 weeks ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఫ్రీ కోర్సు పూర్తిగా తెలుగులో.

    ఇంట్రెస్ట్ ఉన్నవారు, మా యూట్యూబ్ ఛానెల్ ఫాలో అవ్వండి

    YouTube లో

    Cloud Computing in Telugu

    అని సెర్చ్ చెయ్యండి

    1. ఇందులో నా*శ*నం ఏముంది సార్? ఎవరూ పీక మీద కత్తి పెట్టి చూడమని ఫోర్స్ చెయ్యరు కదా! ఇష్టమైనవాడు డబ్బులు ఎక్కువ పెట్టి చూస్తాడు, ఇష్టం లేని వాడు ott లో వచ్చినప్పుడు, అది కూడా మౌత్ టాక్ బాగుంది అంటే చూస్తాడు

Comments are closed.