కేంద్రం దృష్టిలో ఏపీకి రాజధాని లేదా ?

ఉమ్మడి ఏపీ విడిపోయి ఏడేళ్లయింది. 2024 కు పదేళ్లు అయిపోతుంది. విభజన చట్టంలో హైదరాబాదును పదేళ్ళపాటు రాజధానిగా ఏపీ ఉపయోగించుకోవచ్చు అని ఉన్నా విభజన తరువాత ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే అమరావతి…

ఉమ్మడి ఏపీ విడిపోయి ఏడేళ్లయింది. 2024 కు పదేళ్లు అయిపోతుంది. విభజన చట్టంలో హైదరాబాదును పదేళ్ళపాటు రాజధానిగా ఏపీ ఉపయోగించుకోవచ్చు అని ఉన్నా విభజన తరువాత ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే అమరావతి పేరుతొ రాజధాని నిర్మాణం ప్రారంభించారు. కానీ నిర్మాణం విషయంలో ఆయన ఓవర్ యాక్షన్ వల్ల, ఇంకా అనేక కారణాల వల్ల, ఈలోగా చంద్రబాబు ఓడిపోయి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం వల్ల రాజధాని నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది.

జగన్ మూడు రాజధానులను తెర మీదికి తెచ్చారు. అమరావతిని శాసన రాజధాని అని. విశాఖను పరిపాలన రాజధాని అని, కర్నూలును న్యాయ రాజధాని అని అన్నారు. వెంటనే స్పీకర్, మంత్రులు అమరావతిని స్మశానం అని, ఎడారి అని అన్నారు. 

చిరువరాఖరుకు ఏపీకి రాజధాని లేకుండాపోయింది. ప్రస్తుతం ఇది ఏపీ హై కోర్టులో నలుగుతోంది. ఏపీకి అధికారికంగా రాజధాని అమరావతో, విశాఖ పట్టణమో ప్రభుత్వానికి, ప్రజలకు తెలియదు కాబట్టి కేంద్రం హైదరాబాదును ఏపీ రాజధానిగా తన అధికారిక పత్రాల్లో పేర్కొంటున్నట్లు సమాచారం.

కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఏపీ రాజధాని హైదరాబాదు అన్న పేరుతోనే జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి నిర్మాణం పూర్తి కాకపోయినా రాజధానిగా అమరావతిని గుర్తించింది. మ్యాపులో కూడా అమరావతిని రాజధానిగా గుర్తించింది. కానీ ఆ తరువాత జగన్ ప్రభుత్వం రాజధాని ఏదో తేల్చకపోవడంతో అది తేలేంతవరకు హైదరాబాదునే ఏపీ రాజధానిగా వ్యవహరించాలని అనుకున్నదేమో.

సరే … కేంద్ర ప్రభుత్వం హైదరాబాదును ఏపీ రాజధానిగా చెబుతున్నా పరిపాలన హైదరాబాదు నుంచి జరగడంలేదు. ఇతర కార్యకలాపాలేవీ హైదరాబాదు నుంచి నిర్వహించడంలేదు. ఏపీ గవర్నర్ కూడా ఆ రాష్ట్రంలోనే ఉన్నారు. 2024 వరకు ఏపీ రాజధానిగా హైదరాబాదును ఉపయోగించుకునే అవకాశం విభజన చట్టం ప్రకారం ఉంది కాబట్టి కేంద్రం అధికారికంగా హైదరాబాద్ పేరును ఉపయోగించుకుంటున్నదేమో.