సీఎం జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై పదో తరగతి ఫలితాలను అడ్డు పెట్టుకుని విమర్శలు చేస్తున్నవారంతా ఓ విషయం గుర్తుంచుకోవాలి. పిల్లలు పాస్ కావడమే ఇంపార్టెంట్ అనుకుంటే.. అప్పట్లో పరీక్షలు వద్దని ప్రతిపక్షాలు గొడవ చేసినప్పుడే జగన్ తన నిర్ణయాన్ని మార్చుకునేవారు.
ప్రతిభ గలవారు, మిగతావారి కంటే ముందుండాలనే ఉద్దేశంతోనే పరీక్షలు పెట్టారు. టెన్త్ పరీక్ష ఫలితాలపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం అర్థరహితం. చదువుకున్నోడే పాసయ్యాడు, పరీక్షలను లైట్ తీసుకోవడం అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఏపీలో లేదు.
ఫలితాలు తక్కువగా వస్తే ప్రభుత్వానిది తప్పా..?
పరీక్షల ఫలితాల తర్వాత వస్తున్న విశ్లేషణలు, వివరణలు, డిమాండ్లు మరీ అర్థరహితంగా అనిపిస్తున్నాయి. పరీక్ష రాసినవారిలో ఎక్కువమంది ఫెయిలైతే ప్రభుత్వానిది తప్పెలా అవుతుంది..? అమ్మ ఒడి డబ్బుల కోసం, పరీక్ష ఫీజుల పేరుతో వసూళ్ల కోసం జగన్ పిల్లల్ని ఫెయిల్ చేయించారట..! ఇంతకంటే అడ్డగోలు వాదన ఇంకోటి ఉంటుందా..? ఇంగ్లిష్ మీడియం వల్ల పిల్లలు ఫెయిలయ్యారని ఓ మేథావి స్టేట్ మెంట్ ఇస్తారు. అది కరెక్టేనా..?
కరోనా వల్ల పిల్లల చదువు అటకెక్కిందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది కూడా పరీక్షలు పెట్టకపోతే వచ్చే ఏడాది ఇదే సీన్ రిపీట్ కాదని గ్యారెంటీ ఏంటి..? ఎన్నాళ్లు ఆల్ పాస్ అనుకుంటూ చదువుకోనివారిని కూడా పాస్ చేస్తూ పోవాలి. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ పరీక్షలు పెట్టారు, నిస్పక్షపాతంగా రిజల్ట్ వచ్చాయి.
పరీక్షల్ని లైట్ తీసుకోవద్దు..
నిన్న మొన్నటి వరకు కరోనా కాలంలో పరీక్షల్ని చాలామంది లైట్ తీసుకున్నారు. వారంతా భవిష్యత్తులో కచ్చితంగా ఇబ్బంది పడతారు, అందులో అనుమానమేం లేదు. అలా పరీక్షల్ని సరదాగా తీసుకోకూడదనే ఉద్దశంతోటే ఈ ఏడాది ఆ ఆనవాయితీని బ్రేక్ చేద్దామనే సదుద్దేశంతోటే ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల్ని నిర్వహించింది.
పరీక్షల పేపర్లు లీకయ్యాయని రాద్ధాంతం చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు పాస్ పర్సంటేజ్ పై ఇంత వ్యతిరేకంగా ఎలా మాట్లాడగలుగుతున్నాయి.
అసలు తప్పెవరిది..?
కరోనా కాలంలో సరిగా విద్యాబోధన జరగలేదు. అదే సమయంలో పిల్లలు కూడా ఆటపాటలకు, సెల్ ఫోన్లకు అలవాటు పడ్డారు. పుస్తకాలను పక్కనపెట్టారు. గత రెండేళ్లుగా పరీక్షలు లేవు కదా, ఈ ఏడాది ఉంటాయో లేవోననే అనుమానంతో కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆన్ లైన్ క్లాసుల విధానం కూడా మంచి ఫలితాల్ని ఇవ్వలేదు. ఈ కారణాలన్నిటి వల్ల ఫలితాలు తక్కువగా వచ్చాయి.
ఇక కరోనాని మర్చిపొండి, బుద్ధిగా పుస్తకాలు పట్టండి, పద్ధతిగా మార్కులు తెచ్చుకోండి. పాస్ కండి. ఇదీ ఈ ఏడాది పదో తరగతి ఫలితాలు నేర్పించిన గుణపాఠం. ఇందులో ప్రభుత్వానిదో, విద్యార్థులదో, టీచర్లదో, తల్లిదండ్రులదో తప్పు లేదు.