గతం మరచిపోయి జగన్ కే సవాళ్లు!

సూటిగా చెప్పాలంటే రాజకీయ నాయకులు ఒకరిమీద ఒకరు విసురుకునే సవాళ్లకు ప్రతి సవాళ్లకు ప్రజల దృష్టిలో ఏమాత్రం విలువ ఉండదు. ఉబుసుపోక ఏదో కాస్త స్వరం పెంచి తీవ్రంగా హెచ్చరించుకుంటున్నట్టుగా ఉంటుందే తప్ప.. మాట…

సూటిగా చెప్పాలంటే రాజకీయ నాయకులు ఒకరిమీద ఒకరు విసురుకునే సవాళ్లకు ప్రతి సవాళ్లకు ప్రజల దృష్టిలో ఏమాత్రం విలువ ఉండదు. ఉబుసుపోక ఏదో కాస్త స్వరం పెంచి తీవ్రంగా హెచ్చరించుకుంటున్నట్టుగా ఉంటుందే తప్ప.. మాట మీద నిలబడేలా చేసే సవాళ్లు ఏం మనకు కనిపించవు. ఇప్పుడు ఎన్డీయే కూటమి పుణ్యమాని అధికారంలో ఉన్నటువంటి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తన గతం మరిచిపోయి.. అతిశయమైన సవాళ్లు విసురుతున్నారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీదికే ఎగబడి తొడకొడుతున్నారు.

కడప జిల్లాలో అవకాశవాదానికి పేరుమోసిన నాయకుల్లో ఒకరుగా జమ్మలమడుగు నాయకుడు ఆదినారాయణ రెడ్డికి మంచి గుర్తింపే ఉంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా వెలగబెడుతున్న ఆదినారాయణ రెడ్డి తొలుత కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి దయతోనే ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కూడా వైఎస్సార్ హవా ఆయనను మరోమారు ఎమ్మెల్యేగా గెలిపించింది. రాష్ట్ర విభజన అనంతర పర్యవసానాలలో ఆదినారాయణరెడ్డి జగన్ వెంట నిలిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గంలో గట్టిపోటీ ఎదుర్కొని వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.

2019 వచ్చేసరికి పరిస్థితులు మారాయి. 2014లో వైసీపీ తరఫున గెలిచి, జగన్ ను వంచించి.. తెలుగుదేశంలో చేరిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఆదినారాయణ రెడ్డి ఒకరు. అలాగని ఆయన అక్కడ కూడా సరైన గుర్తింపు, ప్రాధాన్యం సంపాదించుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ కూడా టికెట్ ఇవ్వలేదు. జగన్ గెలిచిన తర్వాత భాజపాలో చేరి, తనను తాను కాపాడుకోవడం మీద దృష్టి పెట్టిన ఆదినారాయణ రెడ్డి నియోజక వర్గంలోని వైసీపీ నాయకులు తనకు సరిజోడీలు కానే కారని, అధికార పార్టీకి ఆయన సవాలు విసిరారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే జమ్మలమడుగులో తనపై పోటీ చేయాలని ఆదినారాయణ రెడ్డి సవాలు విసురుతున్నారు.

భాజపాలో ఉన్నంత కాలం బిక్కుబిక్కు మంటూ గడిపిన ఈ చంద్రబాబు నాయుడి కోవర్టు నాయకుడు.. ఇప్పుడు తగుదునమ్మా అంటూ జగన్ మీద విరుచుకుపడుతండడం విశేషం. ఇప్పటికీ జగన్ ను తిడితే సవాళ్లు విసిరితే తనకు పార్టీలో మైలేజీ వస్తుందేమో అనే ఆశ మాత్రమే ఆదినారాయణరెడ్డితో ఇలా మాట్లాడిస్తోందని.. లేకపోతే ఆయన మాటలు కాస్త అదుపులో ఉండేవే అని పలువురు అంచనా వేస్తున్నారు.

10 Replies to “గతం మరచిపోయి జగన్ కే సవాళ్లు!”

    1. అదే ఒక్క ఛాన్స్ సీఎం పెట్టిన సచివాలయం వవస్థని తీయండి

      ఇంటి ఇంటికి పించెన్ తీయండి

      50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల విలనము నీ వెనక్కి తీసుకోండి

      అమ్మ ఒడి ఇవ్వము అని చెప్పండి

      ఉద్యోగుల GPS రద్దు అని చెప్పండి

  1. ఇంతకు ఛాలెంజ్ ని స్వీకరించాడా? లేక ఎప్పటిలాగే పారిపోయాడా పాలస్ పులకేశి??

  2. సాక్షి సంస్థకి సిగ్గూ, పరిమితులూ అన్నవి ఏమాత్రం లేవన్నట్టు చూస్తుంటే, మనసులో ఒక్కటే అనిపిస్తుంది: ఇది నిజంగా సంస్థేనా, లేక రచ్చ పుట్టించడానికి పుట్టిన ఓ యంత్రమా? ఏ చిన్న మంచి విషయం కనిపించినా, సాక్షి ముందుగా ఓ పెద్ద చెంబుతో బురదనే తీసుకువస్తుందని గ్యారంటీ! ఈసారి కూడా అదే పనికి పూనుకుంది. ఎవరూ ఊహించకుండానే, ఆ బురద తానే ముంచుకుంది!

    సాక్షి సూటిగా నడుస్తుందా? అసలు అలాంటి మాటే దాని డిక్షనరీలో ఉండదు! ఆ వంకర బుద్ధి ఎప్పుడూ ఏదో కొత్త రచ్చ కోసం తహతహలాడుతూ ఉంటుంది. “ఇక్కడ కూడా గందరగోళం సృష్టించొచ్చు” అనే ఆలోచనతో, ఎక్కడ చూసినా సాక్షి తన కుట్రల వ్యూహాలను విస్తరించి, చివరికి తానే తింటున్న ప్లేటులోనే బురద పోస్తుంది.

    ఈసారి సాక్షి కుట్రల స్థాయి మరింత పెరిగిందా అని అనిపిస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఏ చిన్న విషయం జరిగినా, సాక్షి దాన్ని మామూలుగా విడిచిపెట్టదు. “ఇక్కడ ఎలాంటి గందరగోళం లేవు కదా?” అనుకున్న క్షణాన, అది ఏకంగా ఒక పెద్ద మేకపందిరి కట్టేసినట్టు ఉంటుంది. దూకుడు, అబద్ధాలు, దుమారం – ఇవే దాని సాధనాలు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే, సాక్షి మాత్రం “ఇదే నా మోమెంటు!” అంటూ గందరగోళం సృష్టించడం కచ్చితమే!

    జనం సాక్షి చేసే రచ్చ చూసి నవ్వుకుంటారు, ఎందుకంటే ఎంత దూకినా, చివరికి నష్టపోయేది సాక్షే! కానీ ఆ వంకర బుద్ధి మాత్రం ఏమాత్రం పాఠం నేర్చుకుంటుందా? అస్సలు కాదు! ఎందుకంటే, సాక్షికి కొంచెం బుద్ధి ఉంటే, ఇంత రచ్చ రేపడం ఎప్పుడో ఆపేసేది!

Comments are closed.