వైసీపీ ఘెరా ఓటమి తర్వాత ఆ పార్టీ ఉంటుందా లేదా అనే చర్చల నేపథ్యంలో.. త్వరలో వైసీపీ పార్టీ ఖాళీ అవ్వబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. బీజేపీ నాయకత్వం ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
ఇవాళ ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో చేరేందుకు రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని .. బీజేపీలోకి చేరాలని ఆయన తండ్రి పెద్దిరెడ్డి మీద కూడా ఒత్తిడి తెస్తున్నారని.. ఇప్పటికే మిధున్ రెడ్డి బీజేపీ పెద్దలకు టచ్ వెళ్లారని.. పార్టీ పెద్దలు ఒప్పకుంటే అవినాష్ మినహా వైసీపీ ఎంపీలు మొత్తం పార్టీ మారడానికి రెడీగా ఉన్నారన్నారు.
జగన్ మళ్లీ ఓదార్పు యాత్ర చేయాడానికి కారణాలు వెతుక్కుతున్నారని.. త్వరలోనే వివేక కేసులో అవినాష్ అరెస్టవుతారని.. కడప ఉప ఎన్నికల్లో టీడీపీ నుండి భూపేశ్ రెడ్డి పోటీ చేయించి గెలిపిస్తామన్నారు. అలాగే షర్మిల గురించి మాట్లాడుతూ చెల్లితో రాజీ చేయాలని తన తల్లిని కోరాడని.. కానీ తన అన్ననే కాంగ్రెస్‌లో చేరాలని చెప్పిందన్నారు.