టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణపై ఆయన సోదరుడి భార్య మణిప్రియ సంచలన ఆరోపణలు చేశారు. 'పిట్టను డేగ ఎత్తుకెళ్లినట్లు నా పరిస్థితి ఉంది. భార్య ఉండగానే అన్నం తీసుకు రాలేదని నన్ను కొట్టాడు. అర్ధరాత్రి టార్చర్ పెడుతున్నాడు' అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె వీడియో పోస్ట్ చేశారు.
తన కుటుంబాన్ని కూడా నారాయణ ఇబ్బంది పెట్టారని.. గత ఎన్నికల్లో తన కోసం ప్రచారం చేయాలని ఒత్తిడి తెచ్చారని.. పెళ్లైన రోజు నుండి టార్చర్ మొదలైందని.. రోజు పొద్దున మొదలు పెడితే సాయంత్రం వరకు తిడుతూనే ఉంటారంటూ అవేదన వ్యక్తం చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
నారాయణ తమ్ముడు మణి, ప్రియ దంపతులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రియ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి నారాయణ స్పందించాల్సి ఉంది. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు అత్యంత ఆప్తుడుగా నారాయణ ఉన్న విషయం తెలిసిందే. కాలేజీల్లో అక్రమాలు, సామాన్యుల్ని దోచుకోవడం కాకుండా లైంగిక వేధింపులా? నారాయణ.. అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.