రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు(83) కన్నుముశారు. ఇవాళ హైదరాబాద్లోని తన స్వగృహంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీ తరపున 2004- 09 వరకు రాజోలు ఎమ్మెల్యేగా పని చేశారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పని చేసిన కృష్ణం రాజు 2009లో రాజోలు ఎస్సీ రిజర్డ్వ్ అయిన తర్వాత పోటీ చేసే అవకాశం కోల్పోయారు. ప్రస్తుతం ఆయన వైసీపీలో కొనసాగుతున్నారు. ఆయన భార్య మల్లీశ్వరి టీటీడీ పాలకవర్గ సభ్యురాలిగా ఉన్నారు. మంచి వ్యాపారిగా కూడా ఆయనకు రాజోలు నియోజకవర్గంలో గుర్తింపు ఉంది.
గత ఎన్నికల్లో జనసేనలో ఉండి ఆ పార్టీ అభ్యర్థి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విజయాం కోసం కృషి చేశారు. జనసేన పార్టీ రాష్ట్రంలో రాజోలులో మాత్రమే గెలవడానికి కారణం కృష్ణంరాజునే అని అక్కడి ప్రజలు అనుకుంటారు. కృష్ణంరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా కృష్ణంరాజు మృతి పట్ల వైసీపీ నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.