పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘బ్రో’. ఈ సినిమా సెట్ చేసింది, స్క్రిప్ట్ కరెక్షన్లు, మాటలు అన్నీ గురూజీ త్రివిక్రమ్. ఈ సినిమా విడుదల మరో రెండు వారాల్లో వుంది సరీగ్గా. కానీ పనులు మాత్రం ఫుల్ టైట్ గా వున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు ఇద్దరు హీరోల డబ్బింగ్ వర్క్ పెండింగ్ లో వుంది. ఈ వారంలో రెండూ పూర్తి కావాల్సి వుంటుంది. ప్రస్తుతం పొలిటికల్ టూర్ లో వున్నారు హీరో పవన్ కళ్యాణ్. ఈవారం లో మూడు రోజులు గ్యాప్ తీసుకుంటారు. ఆ టైమ్ లో డబ్బింగ్ చెప్పేస్తారేమో చూడాలి.
సాయి ధరమ్ తేజ్ అంతా చకచకా చేస్తారు కానీ డబ్బింగ్ దగ్గర కాస్త స్లో. అందువల్ల టోటల్ డబ్బింగ్ కార్యక్రమాలు అయ్యేసరికి మరో వారం పట్టొచ్చు. ఇదిలా వుంటే సినిమాకు ప్రమోషన్ కూడా కాస్త సమస్యే. కేవలం సాయి ధరమ్ తేజ్ నే తన భుజాల మీద వేసుకోవాలి. అలా అని చెప్పి మామూలు సినిమాల మాదిరిగా ఊళ్లు, కాలేజీలు తిరగడం వీలు కాదు.
భీమ్లా, వకీల్ ప్రీ రిలీజ్ లకు పవన్ వచ్చారు. మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారా? ఎప్పుడు? ఎక్కడ అన్నది తెలియాల్సి వుంది. ఎక్కడ చేసినా కాస్త భారీగా వుండేలా చూసుకోవాలి. లేకపోతే క్రౌడ్ ను తట్టుకోవడం కష్టం అవుతుంది.
ఇవన్నీ ఇలా వుంటే సిజి పనులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడ్ అందుకోవాల్సి వుంది. మొత్తానికి విడుదల డేట్ కాస్త టైట్ షెడ్యూల్ నే.