జనసేనాని పవన్‌కల్యాణ్‌కు చీరాల ఇన్‌చార్జ్ ఆమంచి స్వాములు గట్టి షాక్ ఇచ్చారు. చీరాల ఇన్‌చార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. సామాన్య కార్యకర్తగా మాత్రమే కొనసాగుతానని ఆయన వెల్లడించడం గమనార్హం. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో ఆర్భాటంగా ఆమంచి స్వాములు చేరిన సంగతి తెలిసిందే. ఆయన్ను చీరాల ఇన్‌చార్జ్‌గా పవన్‌కల్యాణ్ నియమించారు.
ఇదిలా వుండగా ఆయన గిద్దలూరు టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే గిద్దలూరు టికెట్‌ను గిద్దలూరు టీడీపీ ఇన్‌చార్జ్ అశోక్‌రెడ్డికి ఖరారైంది. పొత్తులో భాగంగా అశోక్‌రెడ్డిని కాదని, జనసేనకు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో గిద్దలూరు దక్కకపోవడంతో ఏకంగా ఇన్‌చార్జ్ పదవికే రాజీనామా చేసి, దాదాపు జనసేన నుంచి తప్పుకున్నట్టైంది.
చీరాల రాజకీయాల్లో అన్నదమ్ములైన ఆమంచి కృష్ణమోహన్, శ్రీనివాసులు అలియాస్ స్వాములు ప్రముఖ పాత్ర పోషించేవారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో అన్నదమ్ములిద్దరూ ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. జనసేన ఇన్‌చార్జ్‌గా తప్పుకున్న స్వాములు భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది తెలియాల్సి వుంది.
తక్కువ సమయంలోనే జనసేనపై అసంతృప్తితో ఇచ్చిన పదవిని కూడా వద్దనడం విచిత్రమే. ఎందుకంటే జనసేనలో ఎవరికీ పదవులు ఇవ్వని సంగతి తెలిసిందే. అలాంటిది స్వాములకు చీరాల బాధ్యతలు అప్పగిస్తే, తిరస్కరించడం చర్చనీయాంశమైంది.