గతంలో చంద్రబాబు సీఎంగా ఉండి స్కిల్ డెవెలప్‌మెంట్ ద్వారా రూ. 371 కోట్లు అవినీతి పాల్పడిన కేసులో ఏ1 ఉన్న చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంపై మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ఎవడు చేసిన కర్మ వాడనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా! అంటూ వెటకారంగా ట్వీట్ చేశారు.
గతంలో చంద్రబాబు చేసిన అవినీతిని గుర్తు చేస్తూనే.. ఆయన చేసిన తప్పులకు ఎప్పటికైన కర్మ అనుభవించ తప్పదని అంబటి గుర్తుచేశారు. కాగా ఇవాళ ఉదయం చంద్రబాబుకు సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు.చంద్రబాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.
మరోవైపు చంద్రబాబు నంద్యాలలో అదుపులోకి తీసుకున్న సీఐడీ.. విజయవాడకు తరలించే యత్నం చేస్తోంది. చంద్రబాబు తన కాన్వాయ్‌లోనే విజయవాడకు వెళ్లబోతున్నారు. తొలుత సీఐడీ కార్యాలయానికి.. తర్వాత చంద్రబాబును కోర్టులో హాజరు పర్చనున్నారు.