నాకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని స్వయంగా ప్రకటించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జనసైనికులతోపాటు అధికార వైసీపీ నుండి విమర్శలు వస్తున్నాయి. కేవలం చంద్రబాబు నాయుడు కోసమే రాజకీయాల్లోకి వచ్చాడని అందుకోసమే ముందే సీఎం అయ్యే అర్హత నాకు లేదని ప్రకటించుకొని.. జన సైనికులు అందరూ టీడీపీ కోసం పనిచేయాలని చెప్పకనే చెప్పారు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
నన్ను సీఎంని చేయాలని టీడీపీ, బీజేపీని అడగను అని… వైసీపీని అధికారంలో నుంచి దించాలన్నదే తమ లక్ష్యం అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై మంత్రి అంబటి రాంబాబు అదిరిపోయే పంచ్ వేశారు. “సీఎం పదవి వద్దంటే.. ప్యాకేజి తోనే సర్దుకుంటావా పవన్” అంటూ ట్వీట్ చేశారు.
కాగా పవన్ వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పక్కా అని తేలిపోయింది. బీజేపీ కూడా రావాలని ఢిల్లీ పెద్దలతో చర్చలు కూడా జరిపారు. ఒక వేళ బీజేపీతో కలిసి రాకపోతే పవన్ చంద్రబాబుతోనే కలిసి వెళ్లే అవకాశం ఉంది. గతంలో కూడా ప్యాకేజీ తీసుకొని టీడీపీ కోసం పని చేశారంటూ వస్తున్న వార్తలను నిజం చేసేలా పవన్ కళ్యాణ్ చేతులెత్తేయడం గమనార్హం.
రాయలసీమలో తమకు బలం లేదని కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తమకు బలం ఉందని స్వయంగా ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఎలా చేసుకుంటారో తెలియాల్సి ఉంది. ఎందుకంటే పక్క పార్టీ వాళ్లు విమర్శిస్తున్నట్లు ప్యాకేజీ కి లొంగి తనకు, తన అన్నకు మాత్రమే సీట్లు తీసుకోని ఇన్ని రోజులు డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయం చేసినా జన సైనికులను ఎక్కడ మోసం చేస్తారో అంటూ వాపోతున్నారు జనసైనికులు.