విశాఖ వైపు అమిత్ షా చూపు

కేంద్రంలో నంబర్ టూ, బీజేపీలో నంబర్ వన్ గా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా చాలా కాలం తరువాత ఏపీకి వస్తున్నారు. ఏపీలో ఎన్నో ప్రాంతాలు ఉండగా ఆయన చూపు విశాఖ…

కేంద్రంలో నంబర్ టూ, బీజేపీలో నంబర్ వన్ గా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా చాలా కాలం తరువాత ఏపీకి వస్తున్నారు. ఏపీలో ఎన్నో ప్రాంతాలు ఉండగా ఆయన చూపు విశాఖ మీద పడింది. 

ఈ నెల 8న విశాఖలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగిస్తారు అని బీజేపీ వర్గాలు తెలిపాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్ళు అయిన నేపధ్యంలో దేశవ్యాప్తంగా అనేక సభలు సమావేశాలూ నిర్వహిస్తున్నారు.

ఏపీలో వివిధ చోట్ల బీజేపీ అగ్ర నాయకత్వం ఆద్వర్యంలో సభలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమిత్ షా విశాఖను ఎంచుకున్నారు. విశాఖ నుంచే బీజేపీ రాజకీయ శంఖారావాన్ని ఆయన పూరించనున్నారు.

గత ఏడాది నవంబర్ లో ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ లో రెండు రోజులు పర్యటించారు ఇపుడు నంబర్ టూ అమిత్ షా విశాఖ వస్తున్నారు. ఆయన ఈ సందర్భంగా చేసే రాజకీయ ప్రసంగం ఏ విధంగా ఉంటుందో అన్న ఆసక్తి అందరిలో ఉంది. విశాఖ గురించి ప్రత్యేకించి అమిత్ షా ఏమైనా మాట్లాడుతారా అన్నది కూడా గమనించాల్సిన విషయం.