ఇలియానా గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఓ బిడ్డను మోస్తోంది. త్వరలోనే తల్లి కాబోతోంది. తన బేబీ బంప్ ఫొటోల్ని కూడా ఆమె ఎప్పటికప్పుడు పరిచయం చేస్తోంది. అయితే ఓవైపు నెలలు నిండుతున్నప్పటికీ, మరోవైపు తన గర్భానికి కారణమైన వ్యక్తి ఎవరనేది మాత్రం ఇలియానా బయటపెట్టకపోవడం విశేషం.
ఇప్పుడా టైమ్ వచ్చినట్టు కనిపిస్తోంది. తన అజ్ఞాత ప్రేమికుడ్ని దశలవారీగా పరిచయం చేయాలని నిర్ణయించుకుంది ఇలియానా. ఇందులో భాగంగా అతడి చేతిలో తన చేయి వేస్తూ దిగిన ఫొటోను షేర్ చేసింది. “మనకు ఇష్టమైన వ్యక్తిని ప్రశాంతంగా తిననివ్వకూడదు, నా దృష్టిలో రొమాన్స్ అంటే ఇదే” అంటూ పోస్ట్ కూడా పెట్టింది.
ఇలియానా పోస్టు తో ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరనే ఉత్కంఠ మరింత పెరిగింది. నెలలు గడిచేకొద్దీ ఇలా తన బాయ్ ఫ్రెండ్ ను దశలవారీగా పరిచయం చేస్తూ, ఒకేసారి బిడ్డతో కలిసి భర్త ఎవరనే విషయాన్ని బయటపెట్టే ఆలోచనలో ఇలియానా ఉన్నట్టు తెలుస్తోంది. షేర్ చేసిన ఫొటో చూస్తుంటే, ఎంగేజ్ మెంట్ లేదా పెళ్లి అయినట్టు కనిపిస్తోందంటూ కొందరు స్పందించడం విశేషం.
ఇక తాజాగా విడుదల చేసిన స్టిల్స్ చూస్తుంటే, ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెకేషన్ కు వెళ్లినట్టు కనిపిస్తోంది. తను గర్భం దాల్చినట్టు ఏప్రిల్ లో ప్రకటించింది ఇలియానా. బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.