మరో రఘురామ కృష్ణంరాజుకు పెరిగిపోతున్న అసహనం!

అధికార వైసీపీలో తిరుబాటుదారుడు రఘురామ కృష్ణం రాజు ఒక్కడే అనుకున్నాం. ఎందుకంటే ఆయన జగన్ మీద బహిరంగంగా తిరుగుబాటు చేస్తున్నాడు. బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నాడు. జగన్ కు వ్యతిరేకంగా మీడియాలో మాట్లాడుతున్నాడు. ఇలా బయటకు…

అధికార వైసీపీలో తిరుబాటుదారుడు రఘురామ కృష్ణం రాజు ఒక్కడే అనుకున్నాం. ఎందుకంటే ఆయన జగన్ మీద బహిరంగంగా తిరుగుబాటు చేస్తున్నాడు. బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నాడు. జగన్ కు వ్యతిరేకంగా మీడియాలో మాట్లాడుతున్నాడు. ఇలా బయటకు కనబడని తిరుగుబాటుదారులు ఎంతమంది ఉన్నారో చెప్పలేం. రఘురామ కృష్ణం రాజు తరువాత చాలా కాలంగా ఇంకో తిరుగుబాటుదారుడు కనబడుతున్నాడు. ఆయన అప్పుడప్పుడు తన నిరసన గళం వినిపిస్తుంటాడు. అదికూడా బహిరంగంగానే.

ఆయన అసలు పుట్టి పెరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఆ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. ఒకదశలో ముఖ్యమంత్రి కూడా అవుతాడేమోనని అనుకున్నారు. రాజకీయాల్లో చాలా సీనియర్. కాంగ్రెస్ పార్టీలో పదవుల పరంగా చాలా గౌరవం పొందాడు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరాడు. (ఈయనతో పాటు సోదరుడు కూడా టీడీపీలో చేరాడు.) కానీ ఈ పార్టీలో కూడా ప్రాధాన్యం దక్కలేదని అసంతృప్తిగా ఉన్నాడు. అక్కడా తిరుగుబాటు చేశాడు. ఆ తరువాత వైసీపీలో చేరాడు. కానీ జగన్ అధికారంలోకి వచ్చినా ఈయనకు మంత్రి పదవి రాలేదు. ప్రాధాన్యం దక్కలేదు. దీంతో తిరుగుబాటుదారుడిగా మారాడు. 

ఆయనే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ఆయన సొంత పార్టీ..సొంత ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాలంటీర్లు..సచివాలయ కన్వీనర్ల సమావేశంలో ఆనం జనం ముందుకు ఎలా వెళ్లాలంటూ అసహనం వ్యక్తం చేసారు. నాలుగేళ్ల పాలనలో ఏం చేసామని ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడగాలని ప్రశ్నించారు. రోడ్ల గుంతలు పూడ్చలేకపోతున్నామని వాపోయారు. కనీసం మట్టి కూడా వేయలేకపోతున్నామంటూ చెప్పుకొచ్చారు. నాలుగేళ్ల కాలంలో ఏమైనా ప్రాజెక్టులు కట్టామా.. ఎక్కడైనా రోడ్లు వేశామా.. నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసామా అని ఆనం ప్రశ్నించారు.

పెన్షన్లు ఇస్తున్నామని వెళితే ఓట్లు వేస్తారా అంటూ నిలదీసారు. పెన్షన్లు గత ప్రభుత్వం కూడా ఇచ్చిందని అన్నారు. పేదలకు ఇళ్లు అని చెప్పాం.. లే అవుట్లు వేశాం..ఇళ్లు కట్టామా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో నీళ్లు ఇస్తామంటూ ఫ్యాన్ కు ఓట్లేయమని అడిగామని..ఇప్పుడు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు సమావేశాలు పెట్టి మీతో పాటుగా కొత్తగా మరో ముగ్గురిని పంపిస్తాం..మీరంతా కలిసి వెళ్లండని చెబుత్నారంటూ తాజాగా గడప గడపకు ప్రభుత్వం వర్క్ షాప్ లో తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు. మీరు టీ తాగండి..వాళ్లకు టీ తాగించండని చెబుతున్నారని ఆనం వ్యాఖ్యానించారు. 

ప్రజలు గ్రామాల్లో రచ్చబండ మీద కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారని .. మనం ఏం చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చి రెండు వేల పెన్షన్ గుంటల రోడ్ల పైన ప్రయాణం చేస్తే మందులకు సరి పోవటం లేదని వాపోతున్నారంటూ ఆనం వివరించారు. రోడ్ల పైన మట్టి కూడా వేసే అవకాశం లేకుండా పోయిందన్నారు. గతంలోనూ ప్రభుత్వం పైన ఆనం ఇటువంటి వ్యాఖ్యలే చేసారు. గతంలో కూడా ఇలాంటి కామెంట్లు చేసిన ఆనం వచ్చే ఎన్నికలనాటికి తన దారి తాను చూసుకుంటాడ?