అందరూ..కథలు వండుతున్నారు

నేను సైతం ప్రపంచాగ్నికి సమధినొక్కటి ధారపోసాను అన్నాడు శ్రీశీ. అలాగే వుంది. జగన్ కాళ్లు గట్టిగా లాగేసి అధికారం నుంచి కిందకు దింపేయడానికి ఎవరి మాట సాయం వారు చేస్తున్నారు. ప్రధాని మోడీని కలిసి…

నేను సైతం ప్రపంచాగ్నికి సమధినొక్కటి ధారపోసాను అన్నాడు శ్రీశీ. అలాగే వుంది. జగన్ కాళ్లు గట్టిగా లాగేసి అధికారం నుంచి కిందకు దింపేయడానికి ఎవరి మాట సాయం వారు చేస్తున్నారు. ప్రధాని మోడీని కలిసి ఎంపీ కనకమేడల సతీమణి కూడా ఇలాగే ఓ మాట వేసి వుంచారట. ఇటీవల తన భర్తతో కలిసి ప్రధాని మోడీ ని కలిసినపుడు …‘‘రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. అభివృద్ధి ఏ కోశానా కనిపించడం లేదు. ప్రజలు మీ జోక్యాన్ని కోరుకుంటున్నారు’’ అని అన్నారట.

సాధారణంగా ప్రధాని స్థాయి వ్యక్తితో పార్లమెంట్ సభ్యుడు అయిన తన భర్త మాట్లాడుతూ వుంటే మధ్యలో కలుగ చేసుకోవడానికి జంకుతారు లేదా మొహమాట పడతారు. కానీ కనకమేడల భార్య ఉష మాత్రం ఇలా మాట్లాడారట.

అసలు ఈ టోటల్ స్టోరీనే భలే ఫన్నీగా వుంది. ప్రధానితో కలిసి ఫొటో తీయించుకోవడానికి అపాయింట్ మెంట్ అడిగి కనకమేడల తన కుటుంబ సభ్యులతో సహా వెళ్లారట. అప్పుడు ఆంధ్ర పరిస్థితులు ప్రస్తావనకు వచ్చాయట. మీ ఆంధ్ర ఎలా వుంది అని ప్రధాని అడిగితే అస్సలు ఏం బాలేదు..అధ్వాన్నంగా వుంది అని బదులిచ్చారట.

దానికి ప్రధాని సుదీర్ఘంగా…’’ ‘‘నేను అన్నీ తెలుసుకొంటున్నాను. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం ఆర్థికంగా బాగా దెబ్బతినిపోయింది. ఏ కార్యకలాపాలూ సాగడం లేదు. అభివృద్ధి లేకుండా పోయింది. పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయి… పంజాబ్‌లో మాదిరిగా పరిస్థితులు తయారవుతున్నాయి’’ అని ప్రతిస్పందించారని రవీంద్ర మీడియాకు తెలిపారట.

ఇది ఎంతవరకు పాజిబుల్..ప్రధాని ఫొటో తీయించుకోవడానికి అపాయింట్ మెంట్ ఇవ్వడం వరకు పెద్ద విషయం కాదు. పార్లమెంట్ సభ్యుల గౌరవం, ప్రోటోకాల్ అలాంటిది. ఇదంతా నిమషాల్లో జరిగిపోయే వ్యవహారం. ఇలాంటి టైమ్ లో ప్రధానితో ఇంత జరిగింది అని ఎంపీ నే ఓ మీడియాతో చెప్పారు కాబట్టి మనం నమ్మాల్సిందే. పైగా ఇక్కడ ఇంకో ముచ్చట కూడా వుంది. చంద్రబాబు ప్రస్తావన కూడా వచ్చిందట… అప్పుడు ఎంపీ ‘’… గతంతో పోలిస్తే చాలా భిన్నమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని, దానిని గుర్తించాలని ఆశిస్తున్నామని’’ అన్నారుట. అంటే అర్థం ఏమిటో?

చంద్రబాబుకు సంబంధించి అప్పటి పరిస్థితులు ఏమిటో? ఇప్పుడు ఏం మారాయో? అంటే మోడీ – చంద్రబాబు బంధం తెగిపోవడానికి గతంలో ఏర్పడిన పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయని ఇండైరెక్ట్ గా చెప్పారా? దానికి ప్రధాని ఐ విల్ సీ అన్నారట కూడా.

ఇంకేం మరి…మోడీ..బాబు బంధం వికసిస్తుంది. ఆంధ్ర అధోగతిలో వుందని ప్రధాని కూడా తెలిసిపోయింది. ఇక మిగిలింది ఒక్కటే భాజపా అండతో తెలుగుదేశం గెలిచి, జగన్ కు కిందకు దింపేయడమే.

కథ చాలా బాగుంది అని ఎవరన్నా అనుకుంటే..అది వాళ్ల ఇష్టం.