తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు పబ్లిసిటీ ముఖ్యం. మిగతావన్నీ ఆమె దృష్టిలో అప్రాధాన్య అంశాలే. చంద్రబాబు, లోకేశ్ గుడ్‌లుక్స్‌లో పడేందుకు అనిత చేస్తున్న ప్రయత్నాలు అర్థం చేసుకోదగ్గవే. పాయకరావుపేట ఎమ్మెల్యే సీటును ఆమె ఆశిస్తున్నారు. కానీ ఆమెను బరిలో నిలిపితే ఏమవుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు.
2014లో పాయకరావుపేటలో గెలిపించిన ప్రజలే, 2019కి వచ్చే సరికి ఆమెను తన్ని తరిమేశారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే ఆ విషయాన్ని ఆమె మరిచిపోయినట్టున్నారు. కొడాలి నానిపై విమర్శించే లెవెల్‌కి ఆమె వెళ్లిపోయారు. చంద్రబాబుపై కొడాలి నాని విరుచుకుపడిన నేపథ్యంలో ఆయనకి కౌంటర్ ఇచ్చేందుకు అనిత మీడియా ముందుకొచ్చారు.
గతంలో నందమూరి హరికృష్ణను కొడాలి నాని ముంచేశారని, అందుకే ఆయన్ని తన్ని తరిమేశాడని అనిత కొత్త విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దగ్గర బాడీగార్డుగా పనిచేసి, ఆయన్ను సైతం కొడాలి నాని మోసం చేశారని అనిత గమ్మత్తైన అంశాన్ని చెప్పారు. అందువల్లే నానీని జూనియర్ ఎన్టీఆర్ దూరంగా పెట్టారన్నారు. టెన్త్ ఫెయిల్ అయిన బ్యాచ్ అంతా వైసీపీలో ఉన్నారని ఆమె ఘాటు విమర్శించారు.
వంగలపూడి అనిత తమకు వద్దే వద్దని పాయకరావుపేట టీడీపీ కార్యకర్తలు, నాయకులు తెగేసి చెప్పడంతో, ఆమెను కొవ్వూరుకు మార్చారు. తానేటి వనితపై పోటీ చేసిన అనిత ఓటమి మూటకట్టుకున్నారు. టెన్త్ ఫెయిల్ అయిన బ్యాచ్ అంతా వైసీపీలో ఉన్నారని అనిత విమర్శ చేయడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వృత్తిరీత్యా అనిత లెక్చరర్. లెక్చరర్ అయిన అనిత ఓ ప్రశ్నకు సమాధానం చెప్పాలని నెటిజన్లు ప్రశ్న సంధించారు.
తన తండ్రి హరికృష్ణ తన్ని తరిమిన కొడాలి నానీని జూనియర్ ఎన్టీఆర్ డ్రైవర్‌గా ఎలా పెట్టుకుంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆ మాత్రం కామన్సెన్స్ లేకుండా విమర్శలు చేస్తున్న అనిత టెన్త్ ఫెయిల్ బ్యాచ్ గురించి ఆశ్చర్యంగా వుందని సెటైర్స్ విసురుతున్నారు.
రాజకీయాల్లో ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనిత, ఆ తర్వాత ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటూ, నాలుగైదుసార్లు గెలిచిన కొడాలి నాని గురించి మాట్లాడ్డం ఏంటని నెటిజన్లు నిలదీస్తున్నారు.