అయ్యన్న…ఎన్నోసారి…?

అనకాపల్లి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మీద నర్శీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన పోలీసుల మీద దురుసుగా వ్యాఖ్యలు చేశారు అని పేర్కొంటూ 353తో…

అనకాపల్లి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మీద నర్శీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన పోలీసుల మీద దురుసుగా వ్యాఖ్యలు చేశారు అని పేర్కొంటూ 353తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు పెట్టారు.

ఈ మధ్య నర్శీపట్నం గ్రామదేవత మరిడిమాంబ ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలకు సరైన అనుమతులు ఇవ్వలేదని అయ్యన్నపాత్రుడు అంటున్నారు. తాము పద్ధతి ప్రకారం ఉత్సవాలను నిర్వహించుకుంటామన్న పోలీసులు అనుమతించకపోవడం ఏంటి అని ఆయన విమర్శించారు.

ఆ ఫ్లోలో అయ్యన్న పోలీసుల మీద కొన్ని కామెంట్స్ చేశారని భోగట్టా. ఇపుడు వాటిని తీసుకుని కేసులు నమోదు చేశారు. ఉత్సవాలు ముగిసాయి. అయ్యన్న మీద కేసులు మిగిలాయి. ఉత్సవాలలో రికార్డింగ్ డ్యాన్సులు ఉండరాదని, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగించినా చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు ముందే స్పష్టం చేశారు.

ఆ మేరకు కేసులు పెట్టారు. అయితే అయ్యన్న మీద ఇప్పటికి ఎన్ని కేసులు పోలీసులు పెట్టారో బహుశా ఆయనకే గుర్తు ఉండదేమో. అందువల్ల ఇది ఎన్నో సారో అన్న మాటనే అంతా అనుకోవాల్సి వస్తోంది. దీన్ని అయ్యన్నతో సహా టీడీపీ నేతలంతా లైట్ తీసుకునే పరిస్థితి ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలీ అంటే గత మూడేళ్లలో అయ్యన్న మీద అనేక పోలీసు కేసులు పెట్టారు.

అదే టైమ్ లో కొన్ని కేసులల్లో అయ్యన్న స్టేలు తెచ్చుకున్నారు. మొత్తానికి అయ్యన్నపాత్రుడు మీద పోలీసు కేసులు అంటే ఇది మామూలే అని జనాలు అనుకునే స్థితి. సో ఈ ప్రభుత్వంలో కేసులు ఇలాగే పెడుతూ ఉంటారని అయ్యన్న అనుచరులు అనుకుంటే వారి వెర్షన్ వైపు నుంచి కూడా చూడాలేమో మరి.