జీఆర్ మ‌హ‌ర్షిః చురుక్కులు

1). ప‌వ‌ర్ హాలిడే అంటే -ప‌వ‌ర్ పోయిన మంత్రుల‌కి ఇచ్చే హాలిడే Advertisement 2). రాజ‌కీయ‌మంటే -తోడేలు గొర్రె వేషంలో రావ‌డం 3). బిజెపి చ‌ర్య‌ల‌తో దేశం మూల్యం చెల్లిస్తోంది -సోనియా -గ‌తంలో కాంగ్రెస్…

1). ప‌వ‌ర్ హాలిడే అంటే -ప‌వ‌ర్ పోయిన మంత్రుల‌కి ఇచ్చే హాలిడే

2). రాజ‌కీయ‌మంటే -తోడేలు గొర్రె వేషంలో రావ‌డం

3). బిజెపి చ‌ర్య‌ల‌తో దేశం మూల్యం చెల్లిస్తోంది -సోనియా -గ‌తంలో కాంగ్రెస్ చెల్లించింది

4). పెట్రోల్ ఏమంటోంది? -త‌గ్గేదేలే

5). టిఆర్ఎస్‌కి 21 ఏళ్లు -అందుకే ఈసారి ఎన్నిక‌ల్లో బిజెపి వాళ్లు “పెళ్లి” చేయాల‌ని చూస్తున్నారు

6). కాంగ్రెస్‌లోకి పి.కె -ఐసియూలో వున్న కాంగ్రెస్‌కి కొత్త వెంటిలేట‌ర్‌

7). కార్య‌క‌ర్త చెంప చెళ్లుమ‌నిపించిన ధ‌ర్మాన‌ -బాల‌య్య బాబు పూనాడేమో!

8). నెల్లూరు సామెత – తిమింగ‌ళాన్ని చూడాలంటే స‌ముద్రంలో వుండాలి

9). స్వ‌దేశీ ఉత్ప‌త్తులే కొంటే నిరుద్యోగం మాయం – మోదీ -మాయ‌మాట‌లు చెప్ప‌డంలో మిమ్మ‌ల్ని మించిన వాళ్లు లేరు

10). కెసిఆర్ నీ అంతు చూస్తాం – బండి సంజ‌య్‌ -బండి ప‌ట్టాలెక్కిన‌ట్టుంది