ఉక్కు సాక్షిగా అంటున్న ఎర్రన్నలు

విశాఖ ఉక్కు పోరాటం ఇపుడు కీలక దశకు చేరుకుంది. ప్లాంట్ లో ముఖ్య విభాగానికి ప్రైవేట్ ఒప్పందాల కోసం బిడ్లను కూడా ఆహ్వానించారు. ఈ బిడ్ల నుంచి ఎవరిని ఎంపిక చేసినా స్టీల్ ప్లాంట్…

విశాఖ ఉక్కు పోరాటం ఇపుడు కీలక దశకు చేరుకుంది. ప్లాంట్ లో ముఖ్య విభాగానికి ప్రైవేట్ ఒప్పందాల కోసం బిడ్లను కూడా ఆహ్వానించారు. ఈ బిడ్ల నుంచి ఎవరిని ఎంపిక చేసినా స్టీల్ ప్లాంట్ లోకి ప్రైవేటీకరణ ప్రవేశించినట్లే. 

ఇటువంటి సమయంలో స్టీల్ ప్లాంట్ ని రక్షించుకునేందుకు ఆఖరు పోరాటానికి కామ్రెడ్స్ రెడీ అయ్యారు. ఈ నెల 26న స్టీల్ ప్లాంట్ వద్ద భారీ సభను నిర్వహించాడం ద్వారా మరో సారి దేశం దృష్టికి ప్లాంట్ ప్రీవేటీకరణ ఇష్యూని తీసుకుని వెళ్ళాలని చూస్తున్నారు.

ఈ సభకు సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్ బీవీ రాఘవులు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాజరవుతున్నారు వీరితో పాటు వివిధ వామపక్ష సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు ఈ సభలో పాల్గొంటున్నారు. స్టీల్ ప్లాంట్ మీద భవిష్యత్తు పోరాటానికి సంబంధించిన కార్యాచరణను రూపకల్పన చేస్తామని వామపక్ష నాయకులు చెబుతున్నారు.

స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లో విక్ర‌యించకుండా కాపాడుకుంటామని యూనియన్ నాయకులు చెబుతున్నారు. దశల వారీగా కార్యక్రమాలు ఉంటాయని, మే నెల మొదటి వారం దాకా అవి కొనసాగుతాయని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దాదాపుగా పూర్తి అయిందని వినవస్తున్న నేపధ్యంలో బిడ్లను సైతం ఇన్వైట్ చేస్తూ ప్లాంట్ లోకి బయట వ్యక్తులకు ఆస్కారం కల్పిస్తున్న తరుణంలో కామ్రేడ్స్ చివరి దశ పోరాటం ఇపుడు ఆసక్తిని రేపుతోంది.

అవసరం అయితే మరోమారు ఢిల్లీ వెళ్ళి మరీ కేంద్రాన్ని నిలదీస్తామని కేంద్ర మంత్రులను సైతం స్టీల్ ప్లాంట్ ఇష్యూలో ప్రశ్నిస్తామని అంటున్నారు. బీవీ రాఘవులు ఈ సభలో ఏమి మాట్లాడుతారో చూడాల్సి ఉంది. ఈ సభకు ఏ ఏ రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయన్నది చూడాలి. తమ ఉద్యమానికి  ఏపీలో అన్ని పార్టీలను కలుపుకుంటామని కామ్రేడ్స్ చెబుతున్నారు.