ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యాశాఖపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. తాజాగా ప్రతి మండలనికి ఎంఈఓ-2 పోస్టులను మంజూరు చేస్తు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రం మొత్తం మీద 679 ఎంఈఓ-2 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీనితో ప్రతి మండలానికి ఇకపై ఇద్దరు మండల విద్యాధికారులు ఉండబోతున్నారు. విద్యా శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇకపై పాఠశాల్లో మొరుగైన పని తీరు కనపరచనుంది.
ఇప్పటికే విద్యాశాఖలో ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ప్రమోషన్స్ పై కూడా ఇటీవల కాలంలోనే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా అదనపు మండల విద్యాధికార పోస్టులతో సీనియర్ ఉపాధ్యాయులకు మంచి జరగనుంది.
విధ్యాశాఖ ప్రతిష్టం చేసే దిశలో అదనపు మండల విద్యాధికారులు తోర్పడుతారని, పిల్లలకు ఇంక నాణ్యమైనా విద్య అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అదనపు పోస్టుల వల్ల అయినా ప్రభుత్వంపై అక్కడక్కడ ఉన్న కోపం చల్లరుతుంటున్నారు రాజకీయ విశ్లేషకులు.