వైఎస్ వివేకా హత్యకేసులో మరో ట్విస్ట్‌!

మాజీ మంత్రి వైయ‌స్ వివేకా హ‌త్య కేసులో మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. వివేకా హ‌త్య కేసులో విచార‌ణ జ‌రుపుతున్న సీబీఐ కడ‌ప ఎంపీ వైయ‌స్ అవినాశ్ రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడు గ‌జ్జ‌ల…

మాజీ మంత్రి వైయ‌స్ వివేకా హ‌త్య కేసులో మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. వివేకా హ‌త్య కేసులో విచార‌ణ జ‌రుపుతున్న సీబీఐ కడ‌ప ఎంపీ వైయ‌స్ అవినాశ్ రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడు గ‌జ్జ‌ల ఉద‌య్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. పులివెందుల‌లో ఆయ‌న ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు.. ఉదయ్‌ని అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు. 

ఉద‌య్ తుమ్మల పల్లి యురేనియం కర్మాగారంలో పనిచేస్తున్నాడు. గూగుల్ టేక్ ఔట్ సమాచారం ఆధారంగా వివేకా హత్య రోజు అవినాష్, శివశంకర్ తో పాటు ఉదయ్ ఘటనా స్థలానికి వెళ్లినట్లు సీబీఐ గుర్తించింది. కాగా ఇప్ప‌టికే పలుమార్లు ఉదయ్ ని సీబీఐ విచారించింది. గతంలో విచారణ పేరుతో సీబీఐ తనని వేధిస్తోందని సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై క‌డ‌ప కోర్టులో కేసు కూడా వేశారు. 

కాగా వివేకా కేసులో ఇప్పటి వరకు సీబీఐ నాలుగు సార్లు ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించింది.  సీబీఐ జరిపిన విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డ్‌ను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించిన విష‌యం తెలిసిందే.