చంద్ర‌బాబు మాజీ పీఎస్‌పై సస్పెన్షన్ వేటు!

ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టై జైల్లో ఉన్న చంద్ర‌బాబు నాయుడుకు మ‌రో షాక్ త‌గిలింది. ఆయ‌న‌ మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌ను స‌స్పెండ్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం…

ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టై జైల్లో ఉన్న చంద్ర‌బాబు నాయుడుకు మ‌రో షాక్ త‌గిలింది. ఆయ‌న‌ మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌ను స‌స్పెండ్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం ప్లానింగ్ డిపార్డ్‌మెంట్ అసిస్టెంట్ సెక్ర‌ట‌రీగా ప‌నిచేస్తున్న శ్రీనివాస్ ప్ర‌భుత్వ స‌ర్వీస్ రూల్స్ అతిక్ర‌మించినందుకు స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు సీఎస్ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. 

స్కిల్ స్కాంలో శ్రీనివాస్ ముఖ్య‌ పాత్ర ఉంద‌ని సీఐడీ ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ద్వారానే చంద్ర‌బాబుకు నిధులు చేరాయ‌ని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. కేసు విష‌యం తెలియ‌గానే ప్ర‌భుత్వ అనుమ‌తి లేకుండా శ్రీనివాస్ అమెరికాకు పారిపోయారు. ఈ క్ర‌మంలో నిన్న‌టిలోగా తిరిగి రావాల‌ని ప్ర‌భుత్వం నోటిసులు ఇచ్చినా ఆయ‌న వెన‌క్కి రాక‌పోవ‌డంతో ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేస్తు నిర్ణ‌యం తీసుకుంది. 

కాగా ఇప్ప‌టికే నారా లోకేష్ సన్నిహితుడు రాజేష్ కూడా దేశం వ‌దిలి అమెరికాకు పారిపోయిన విష‌యం తెలిసిందే. అలాగే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న ప‌ల్లోంజి సంస్థ ప్ర‌తినిధి మ‌నోజ్ వాసుదేవ్ దూబాయ్‌కు పారిపోయిన‌ట్లు సీఐడీ గుర్తించింది. ముందుగా ఈ నెల 11 నుండి త‌న‌కు సెల‌వు కావాలంటూ ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న శ్రీనివాస్‌ ఐటీ నోటీసుల వ్య‌వ‌హ‌రం బ‌య‌ట‌కు రాగానే ఈనెల 6న హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లిపోయినట్టు సీఐడీ గుర్తించింది.