ఇదెక్క‌డి విడ్డూరం?

నూత‌న మ‌ద్యం పాల‌సీని ప్ర‌భుత్వం తీసుకొచ్చే ఆలోచ‌న‌లో వుంది. ఇప్ప‌టికే ఆరు రాష్ట్రాల్లో ఎక్పైజ్ అధికారులు ప‌ర్య‌టించి అధ్య‌య‌నం చేసి, నూత‌న పాల‌సీని తీసుకొచ్చేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఎక్పైజ్‌శాఖ క‌మిష‌న‌ర్…

నూత‌న మ‌ద్యం పాల‌సీని ప్ర‌భుత్వం తీసుకొచ్చే ఆలోచ‌న‌లో వుంది. ఇప్ప‌టికే ఆరు రాష్ట్రాల్లో ఎక్పైజ్ అధికారులు ప‌ర్య‌టించి అధ్య‌య‌నం చేసి, నూత‌న పాల‌సీని తీసుకొచ్చేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఎక్పైజ్‌శాఖ క‌మిష‌న‌ర్ నిశాంత్‌కుమార్ నూత‌న పాల‌సీపై విడ్డూర‌మైన ప్ర‌క‌ట‌న చేశారు.

రాష్ట్రంలో అమ‌లు చేయ‌బోతున్న నూత‌న మ‌ద్యం పాల‌సీపై మ‌హిళా సంఘాలు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధుల నుంచి అభిప్రాయాలు, సూచ‌న‌లు కోరుతూ ఎక్సైజ్‌శాఖ క‌మిష‌న‌ర్ నిశాంత్‌కుమార్ ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అస‌లు మ‌ద్యం వ‌ద్దే వ‌ద్ద‌ని మ‌హిళా సంఘాలు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆదాయ కిక్కు త‌ప్ప‌, ప్ర‌భుత్వాల‌కు కుటుంబాలు ఏమ‌వుతాయో అనే ధ్యాసే లేదు.

ఏం ఆశించి మ‌హిళ‌లు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల యాక్టివిస్టుల నుంచి అభిప్రాయాలు, సూచ‌న‌ల్ని ప్ర‌భుత్వం కోరుతున్న‌దో అర్థం కావ‌డం లేదు. నూత‌న పాల‌సీకి అంద‌రి ఆమోదం వుంద‌ని ప్ర‌చారం చేసుకోడానికే ప్ర‌భుత్వం ఇలాంటి గిమ్మిక్కులు చేస్తోంద‌నే విమ‌ర్శ లేక‌పోలేదు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆలోచ‌న‌లు, ప‌నితీరు గ‌మ‌నిస్తున్న వారెవ‌రికైనా, ఇలాంటి వాటి గురించి సులువుగా అర్థం చేసుకుంటారు.

8 Replies to “ఇదెక్క‌డి విడ్డూరం?”

  1. అభిప్రాయం అడగటం కూడా తప్పేనా? నీది బులుగు మీడియా సంస్థ కాదు, బులుగు సినిమాలు తీయాలిసిన సంస్థ

Comments are closed.