తిరుమ‌ల‌లో ఏం సంస్క‌ర‌ణ‌లు తెచ్చిన‌ట్టు?

సాక్ష్యాత్తు దేవాదాయ‌శాఖ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిని తిరుమ‌ల‌లో భ‌క్తులు నిల‌దీయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఒక రోజంతా ఎదురు చూసినా తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌న భాగ్యం ద‌క్క‌లేద‌ని దేవాదాయ‌శాఖ మంత్రికి త‌మిళ‌నాడు భ‌క్తులు మొర‌పెట్టుకున్నారు. అలాగే క్యూలైన్ల‌లో…

సాక్ష్యాత్తు దేవాదాయ‌శాఖ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిని తిరుమ‌ల‌లో భ‌క్తులు నిల‌దీయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఒక రోజంతా ఎదురు చూసినా తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌న భాగ్యం ద‌క్క‌లేద‌ని దేవాదాయ‌శాఖ మంత్రికి త‌మిళ‌నాడు భ‌క్తులు మొర‌పెట్టుకున్నారు. అలాగే క్యూలైన్ల‌లో అన్న ప్ర‌సాదాలు పంపిణీ చేయ‌లేద‌ని మ‌రి కొంత మంది భ‌క్తులు మంత్రి ఎదుట ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

కంపార్ట్‌మెంట్ల‌లో, క్యూలైన్ల‌లో భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదం, పాలు, మ‌జ్జిగ అంద‌జేయ‌క‌పోవ‌డంతో చిన్న‌పిల్ల‌లు ఆక‌లితో అల‌మ‌టించార‌ని మంత్రిపై భ‌క్తులు ఫైర్ అయ్యారు. ఈ ప‌రిణామాల‌తో మంత్రి అవాక్క‌య్యారు.

కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీర‌క‌నే తిరుమ‌ల‌లో ఇన్‌చార్జ్ ఈవో ధ‌ర్మారెడ్డిని బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించింది. బాబు ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత ఈవోగా శ్యామ‌లారావు, అద‌న‌పు జేఈవోగా వెంక‌య్య చౌద‌రిని నియ‌మించారు. సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత చంద్ర‌బాబు తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. తిరుమ‌ల‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ సంస్క‌ర‌ణ‌ల‌ను ఇక్క‌డి నుంచే మొద‌లు పెడ‌తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

అయితే అవ‌న్నీ మాట‌ల వ‌ర‌కే ప‌రిమితం అయ్యాయి. ఎలాంటి మార్పులు జ‌ర‌గ‌లేదు. భ‌క్తుల‌కు ద‌ర్శ‌న భాగ్యం త్వ‌రగా చేయించ‌డంలో అధికారులు విఫ‌ల‌మ‌య్యార‌ని మంత్రి ఆనంపై వారి ఆగ్ర‌హ‌మే నిద‌ర్శ‌నం. అలాగే భ‌క్తుల‌కు క‌నీసం అన్న ప్ర‌స్తాదం, మ‌జ్జిగ‌, పాలు అందించ‌క‌పోతే, ఇక ఏం సంస్క‌ర‌ణ‌లు చేశార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. గ‌తంలో భ‌క్తుల‌కు ఇవే విష‌యాల్లో ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేశాయి. అధికారం మారిదే త‌ప్ప‌, తిరుమ‌ల‌లో భ‌క్తులకు తిప్ప‌లు త‌ప్ప‌డం లేద‌ని చెప్పొచ్చు.

7 Replies to “తిరుమ‌ల‌లో ఏం సంస్క‌ర‌ణ‌లు తెచ్చిన‌ట్టు?”

Comments are closed.