హీరోయిన్ కెరీర్ అంటే.. పదేళ్ల కిందటి వరకూ కూడా దాని వ్యవధి నాలుగైదేళ్లు! ఎంత స్టార్ స్టేటస్ కు ఎదిగిన హీరోయిన్ కూడా నాలుగైదేళ్లకు మించి ఫీల్డ్ లో కొనసాగడం కష్టమనే ట్రెండ్ టాలీవుడ్ లో అయినా, బాలీవుడ్ లో అయినా, కోలీవుడ్ లో అయినా కొనసాగింది. అంతకు ముందు పరిస్థితులు వేరే! 1950లతో మొదలుపెడితే.. 1980ల వరకూ హీరోయిన్ల కెరీర్ లు కూడా దీర్ఘకాలమే సాగాయి. స్టార్ స్టేటస్ కు ఎదిగిన హీరోయిన్లు వందల సినిమాల్లో చేసిన వారు చాలా మందే ఉన్నారు.
హీరోయిన్లు అప్పట్లో సక్సెస్ లు పొందారంటే.. అవకాశాలకు కొదవ ఉండేది కాదు. ఆ పై హీరోయిన్లు నిర్మాతలుగా, దర్శకులుగా మారిన వారు కూడా ఉన్నారు! లేడీ సూపర్ స్టార్లు అనిపించుకున్న వాళ్లు, హీరోలతో సమానమైన రెమ్యూనిరేషన్ కోరిన వారూ ఉన్నారు! అయితే 90ల నుంచి పరిస్థితులు మారిపోయాయి. హిందీలో కొంత బెటర్ కానీ, సౌత్ లో అయితే.. స్టార్ హీరోయిన్ అనే నిర్వచనమే మారిపోయింది. ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా నాలుగైదేళ్లలో వీలైనన్ని అవకాశాలను పొందడమే గొప్పగా మారింది.
రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్లు పుట్టుకొచ్చారు, కొన్నాళ్లకు వారు తెరమరుగు అయిపోయారు. ఏదైనా సినిమా హిట్ అయ్యిందంటే.. అందులో హీరోయిన్ కు మరుసటి ఏడాది నాలుగైదు సినిమాల్లో అవకాశాలు, కోటి రూపాయల రేంజ్ రెమ్యూనిరేషన్ ఇవన్నీ కామన్! ఆ తర్వాత మరో మెరుపు వచ్చిందంటే, స్టార్ హీరోయిన్ తెరమరుగు అయ్యే పరిస్థితి! దాదాపు మూడు దశాబ్దాల పాటు.. అలాంటి పరిస్థితే కొనసాగింది!
అయితే ఇప్పుడు రోజులు మారాయి. హీరోయిన్లకూ కాలం కలిసొస్తోంది. ఇప్పుడు ఏ హీరోయిన్ కెరీర్ కూడా నాలుగైదేళ్లే అని చెప్పే పరిస్థితి లేదు! సక్సెస్ లతో స్టార్లుగా మారిన కొందరు హీరోయిన్లు ఇప్పుడు దశాబ్దకాలం పైనే ఫీల్డ్ లో ఉంటున్నారు. అది కూడా అవకాశాలతో! ఇప్పటికీ చేతినిండా అవకాశాలతో కనిపిస్తున్న వారిలో చాలా మంది దశాబ్దం పై నుంచినే తెరపై ఉన్న వారు ఉన్నారు.
నయనతార, కాజల్ అగర్వాల్, సమంత, అనుష్కా షెట్టి, తమన్నా, త్రిష.. వీళ్లంతా ఒకానొక దశలో స్టార్ హీరోయిన్లు. ఇప్పటికీ స్టార్లే! రెమ్యూనిరేషన్ల విషయంలో వీళ్లు కొత్త స్థాయిలను క్రియేట్ చేసిన వాళ్లే! వీళ్లలో ఇప్పుడు 50 సినిమాలను పూర్తి చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు! ఎప్పుడో సావిత్రి, వాణిశ్రీల కాలాల్లో హీరోయిన్లు రెండు వందల సినిమాల స్థాయి. ఒక జయసుధ, జయప్రదలు కూడా వందల సినిమాల్లో హీరోయిన్లుగా నటించిన వాళ్లే! విజయశాంతి వరకూ కూడా నంబరాఫ్ మూవీస్ విషయంలో పెద్ద నంబర్లే ఉండేవి.
సిమ్రాన్, ఇలియానా వంటి వాళ్లు తెరను ఏలినసమయంలో వేర్వేరు భాషల్లో నటించడం వల్ల ఎక్కువ సినిమాలు వాళ్లకు లభించి ఉండవచ్చు. అయితే కొంతకాలానికి వారు హీరోయిన్లుగా అవకాశాలు పొందడమే తగ్గిపోయింది! ఆ సమయంలో చాలా మంది హీరోయిన్ల కెరీర్ లు రెండు మూడేళ్లకే ముగియగా, కొందరికి హిట్లు లభించినా రెండు మూడు సినిమాలతోనే తెరమరుగు అయ్యే పరిస్థితి!
ఇప్పుడు వస్తున్న కొత్త సినిమాల ప్రకటనల్లో.. హీరోయిన్లు ఎవరయ్యే అంటే, నయనతార, త్రిష, శ్రియ, మంజూవారియర్ , జ్యోతిక, కాజల్ అగర్వాల్, స్నేహా వంటి వాళ్ల పేర్లే వినిపిస్తూ ఉన్నాయి! ఇండస్ట్రీలో ట్రెండ్ మారిపోయింది. ఇది పాత హీరోయిన్ల చుట్టూరా తిరుగుతోందిప్పుడు! భారీ బడ్జెట్ సినిమాల్లో.. స్టార్ హీరోల సినిమాల్లో కూడా పాత హీరోయిన్లే కనిపిస్తున్నారు. దీనికి కారణాలు ప్రధానంగా రెండు! అందులో ఒకటి.. సౌత్ లో అయినా, నార్త్ లో అయినా స్టార్ హీరోలకు వయసు మీద పడింది!
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రజనీకాంత్, కమల్ హాసన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఇలా అందరూ వయో వృద్ధులుగా మారుతున్నారు! 70 లు దాటేసినవారు, 60లలో ఉన్న వారు చాలా మంది ఉన్నారు! వీరిలో కొంత వరకూ తెలుగు హీరోలు తమ కూతుళ్ల కన్నా చిన్న వయసు ఉన్న అమ్మాయిలతో స్టెప్పులేస్తున్నారు! అవి ప్రహసనం పాలవుతున్నాయి. మోహన్ లాల్, మమ్ముట్టీ లాంటి వాళ్లు తమ వయసుకు తగ్గ పాత్రలు వేస్తూ తమ సినిమాల్లో హీరోయిన్ల ప్రస్తావన పెద్దగా లేకుండా చూసుకుంటున్నారు. ఒకవేళ హీరోయిన్ ఉన్నా.. తమ వయసుకు తగ్గట్టుగా మీనాని, జ్యోతికను వాళ్లు జోడీగా ఎంచుకుంటున్నారు! అది వేరే లెవల్!
ఇక ఇప్పటికీ స్టెప్పులేస్తున్న చిరంజీవి, రజనీకాంత్, బాలకృష్ణలు ఎలాగో కాజల్ నో, నయనతారనో, త్రిషనో తీసుకోవాల్సిన పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. అయితే వీళ్ల జోడీలు ఆ కథల్లో ముదురు బెండకాయల్లా ఉంటున్నాయనేది వేరే కథ! హీరోలే కాదు.. హీరోయిన్లు కూడా ముదిరిపోయి కనిపిస్తున్నారు అనే కామెంట్లు వినిపించాయి చిరంజీవి, బాలకృష్ణ సినిమాల విషయంలో! అయినా తప్పదు!
తెలుగు సినిమా హీరోలకు వయసు ముదురుతున్నా ఆరు పాటలు, ఐదు ఫైట్ల ఫార్ములానే కాబట్టి.. కుర్ర హీరో, కుర్ర హీరోయిన్ అనుకోవాలన్నట్టుగా 70 దాటిన హీరో, 40కి చేరువ అయిన హీరోయిన్లను తెరపై చూడాల్సిందే! ఈ పరిస్థితి హీరోయిన్లకు అయితే ఒకింత వరప్రదంగా మారింది. పెళ్ళిళ్లు అయినా, పిల్లలు కలిగిన తర్వాత కూడా వారికి కోట్లిచ్చే అవకాశాలను తెచ్చి పెడుతున్నట్టుగా ఉంది!
Great Andra yeppudu negative gane news untai 🤦
Vayasu sariraniki manasuku kadhu be positive
వావి వయసు వరస ఏముంది.. మనసు సరసు ఉంటే చాలు.. వీర్యం పంచే వారంతా వీరులే.. మగమహారాజులే…
u mean she/kka la/ng/a 1/1 does not have …
vc available 9380537747
ఏదేమైనా వీళ్లని థియేటర్లో చూడం
Movies lo story ki saripoye character ni thesukuntaru
Call boy works 9989793850
vijay& ajith intelligently expected this negative comments& doing movies with senior heroines…
వయో వృద్ధులు.. ముసలి గోల