విశాఖను అడ్డం పెట్టుకుని చాలా మాట్లాడుతున్నారు. విశాఖ నేర నగరం అంటున్నారు. కబ్జాల సిటీ అంటున్నారు. కిడ్నాప్ లు అంటున్నారు. ఇదంతా చూస్తే రాజకీయంగానే టర్న్ తీసుకుంటోంది. అందువల్ల దీనికి ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
విశాఖ ఏపీలో అతి పెద్ద సిటీ. దాని ఇమేజ్ ఈ విధంగా విమర్శలతో చెడగొడితే చిల్లర రాజకీయాలతో అల్లరి పాలు అయితే ఏపీకి ఉన్న ఆశ శ్వాస లాంటి వైజాగ్ ఇబ్బందులు పడుతుందని భావించిన జగన్ ప్రభుత్వం విశాఖ కేసులు అన్నీ కూడా టాస్క్ ఫోర్స్ పరిధిలోకి తీసుకుని వస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర హోం శాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక మీదట వివిధ పోలీస్ స్టేషన్లలో విడిగా దర్యాప్తు చేసే కేసులు అన్నీ ఇపుడు టాస్క్ ఫోర్స్ కే వెళ్తాయి. అక్కడే విచారణ చేస్తారు మే నెల 23 నుంచి అన్ని కేసులూ టాస్క్ ఫోర్స్ పరిధిలోకే అంటూ ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు. దాంతో విశాఖలో ఇక మీదట కేసులన్నీ టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఫోకస్ తో టేకప్ చేస్తారు.
ఈ విషయాన్ని ధృవీకరించిన విశాఖ సీపీ విశాఖలో నేరాలను ఇప్పటికే అదుపు చేశామని, ఇక మీదట మరింత కట్టుదిట్టమైన చర్యలను చేపడతామని సిటీ ఆఫ్ డెస్టినీ ఖ్యాతిని పెంచుతామని పేర్కొంటున్నారు. విశాఖ విషయంలో విషం చిమ్మే వర్గాలు ఎవైనా ఉంటే ఇకనైనా నోరెత్తకుండ ఉండేలా ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు.