ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ ఉదయం రాజ్ భవన్లో అబ్దుల్ నజీర్‌తో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన జస్టిస్ అబ్దుల్ నజీర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీం కోర్టు జడ్జిగా జస్టిస్ అబ్బుల్ నజీర్ కీలక తీర్పులు ఇచ్చారు. త్రిపుల్ తలాక్ చెల్లదంటూ 2017లో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో, నోట్ల రద్దు చట్టబద్ధమని ప్రకటించిన సుప్రీం ధర్మాసనంలో, 2019లో అయోధ్య రామమందిరంపై తీర్పు వెలువరించిన ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ఒకరు.
ఈ ఏడాది జనవరి 4న పదవీ విరమణ చేసిన జస్టిస్ నజీర్‌ను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది. ఇప్పటి వరకు రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగిన బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి మూడో గవర్నర్‌గా అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టారు.