జ‌గ‌న్ కు కాంగ్రెస్ భ‌యం ప‌ట్టుకుంది..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని జాతీయ పార్టీల అధ్య‌క్షులు భ‌లే స‌రదా మ‌నుషులు. సీరియ‌స్ విష‌యాన్ని కూడా త‌మ‌షాగా చెప్ప‌డం వారికే చెల్లింది. ఒక వైపు బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు.. మ‌రో వైపు పీసీసీ అధ్యక్షుడు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని జాతీయ పార్టీల అధ్య‌క్షులు భ‌లే స‌రదా మ‌నుషులు. సీరియ‌స్ విష‌యాన్ని కూడా త‌మ‌షాగా చెప్ప‌డం వారికే చెల్లింది. ఒక వైపు బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు.. మ‌రో వైపు పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఒక‌రికి మించి మ‌రోక‌రు అన్న‌ట్లుగా మాట‌లు చెప్పుతుంటారు. తాజాగా గిడుగు రుద్ర‌రాజు మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని సిద్ధం చేస్తున్నాం అని, ప్రస్తుతం వైసీపీకి కాంగ్రెస్‌ భయం పట్టుకుంది. అటు పెద్ద జోక్ చేశారు. ఎందుకంటే నోటాతో పోటీ ప‌డే పార్టీకి జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారు అంటే అంత కంటే పెద్ద జోక్ ఏమైనా ఉందా అని అంటున్నారు వైసీపీ నేత‌లు.

ఇవాళ తిరుప‌తిలో రుద్ర‌రాజు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జ‌గ‌న్ ను, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబును ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్ధితిలో లేర‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 100 సీట్లు గెలుస్తుంద‌ని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రాణ త్యాగాల నుంచి వ‌చ్చిన పార్టీ అని ఈ పార్టీకి ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉంద‌ని దాని కోసం అంద‌రం క‌లిసి ప‌ని చేయాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్ర‌తేక్య హోదా తెచ్చే సామ‌ర్థ్యం కాంగ్రెసేకే ఉంద‌న్నారు.

కాంగ్రెస్, బీజేపీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎంత ఓటు బ్యాంక్ ఉంద‌ని తెలిసి కూడా ఇరువురు పార్టీ అధ్య‌క్షులు మీడియా క‌న‌ప‌డ‌గానే సీఎం జ‌గ‌న్ మ‌మ్మ‌లిని చూసి బ‌య‌ప‌డుతున్నారు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో మా పార్టీ గెలుస్తుంద‌ని చెప్పుకుంటున్నారు. ముందుగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌నీసం ఎన్ని స్ధానాల్లో డిపాజిట్ వస్తాయో చెప్పాల‌ని ఆ త‌ర్వాత వైసీపీ, టీడీపీ గురించి మాట్లాడాల‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.