శ్రీకాకుళం అంటే వెనకబడిన ప్రాంతం అని చెప్పనక్కరలేదు. దానికి పర్యాయ పదంగానే ఉంటుంది. ఏలికలు ఎంతమంది మారినా ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా కూడా శ్రీకాకుళం అలాగే ఉంది. అలాంటి శ్రీకాకుళం రూపురేఖలు మార్చేందుకు వైసీపీ ప్రభుత్వం నడుం బిగించింది. నిజంగా ఇది ఈ ప్రాంతానికి గొప్ప వరం, సరికొత్త అవకాశంగా భావించాలి.
శ్రీకాకుళం నగర పరిధిలోకి ఏకంగా ఏడు మండలాలు, 307 రెవిన్యూ గ్రామాలు కొత్తగా వచ్చి చేరనున్నాయి. దీంతో శ్రీకాకుళం అర్భన్ డెవలప్మెంట్ అధారిటీ పరిధిలోకి 1,121 చదరపు కిలోమీటర్ల ప్రాంతం కలవనుంది. టోటల్ గా చూస్తే 5,284 కిలోమీటర్లతో శ్రీకాకుళం మహానగరం స్థాయికి చేరనుంది.
శ్రీకాకుళాన్ని విస్తరించి మరింతగా అభివృద్ధి చేయడానికి వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను కూడా విడుదల చేస్తోంది. కొత్తగా చేరిన ఏడు మండలాలు సారవకోట, మెళియాపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, లక్ష్మినరసుపేట, భామిని వంటి వాటికి ఇపుడు నగర కళ రానుంది.
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో శ్రీకాకుళాన్ని విశాఖతో సమానంగా చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. శ్రీకాకుళం అంటే వలసల జిల్లాగా ఇప్పటిదాకా పేరుంది. అభివృద్ధికి కనుక ఈ ప్రాంతం నోచుకుంటే కచ్చితంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడి కొత్త సిక్కోలుని చూస్తారని అంటున్నారు. వలసలకు ఫుల్ స్టాప్ పడడమే కాదు, ఇక్కడికే సమీప ప్రాంతాల వారు వస్తారని అంటున్నారు.