ఏయూలో వేతన ఘోష

ఏయూలో వీసీగా ఉన్న ప్రసాదరెడ్డి రాజీనామా చేశారు. టీడీపీ కూటమి నేతలు వీసీ రాజీనామాను డిమాండ్ చేయడంతో ఆయన తన పదవిని వదులుకున్నారు. వీసీలను నియమించేది గవర్నర్. ఆయన తొలగిస్తేనే తప్ప వీసీలు ఏ…

ఏయూలో వీసీగా ఉన్న ప్రసాదరెడ్డి రాజీనామా చేశారు. టీడీపీ కూటమి నేతలు వీసీ రాజీనామాను డిమాండ్ చేయడంతో ఆయన తన పదవిని వదులుకున్నారు. వీసీలను నియమించేది గవర్నర్. ఆయన తొలగిస్తేనే తప్ప వీసీలు ఏ ప్రభుత్వంలో నియమితులైనా కూడా కొనసాగుతారు.

కానీ తొలిసారిగా ఒక ప్రభ్తువం మారినపుడు పెద్ద ఎత్తున ఏపీ వ్యాప్తంగా వీసీలు రాజీనామా చేశారు. అలా చేయమని వారిని డిమాండ్ చేయడం తప్పు అని వైసీపీ నేతలు వాదిస్తున్నా అది జరిగిపోయింది. ఏయూ వీసీ రాజీనామా చేసి మూడు వారాలు అయింది.

ఏయూకి ఇంచార్జి వీసీ నియామకం కూడా జరగలేదు. దాంతో జూలై నెల జీతాలు రాక ఏయూలఒని ఉద్యోగులు, పెన్షనర్లు అల్లాడిపోతున్నారు. కొత్త నెల వచ్చి సగం రోజు దాటిపోయాయి. కానీ వేతనం పడలేదు. ఏయూలో ప్రతినెలా ఉద్యోగుల జీతాలకు రిటైర్ అయిన వారి పెన్షన్లు కలుపుకుని 32 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఫైల్ మీద వీసీ కానీ ఇంచార్జి వీసీ కానీ సంతకం పెడితేనే జీతాలు వస్తాయి.

కొత్త వీసీ నియామకం లేటు కావచ్చు కనీసం ఇంచార్జిని అయినా నియమించమని కోరుతున్నారు.  వీసీ లేక జీతాలు రాక నానా అవస్థలు పడుతున్నామని ఉద్యోగులు అంటున్నారు. ఇంచార్జి వీసీ కోసం కూడా రేసులో పలువురు ఉన్నారని అంటున్నారు. వారి పేర్లను పరిశీలించి ఎవరిని నియమిస్తారో చూడాలి.