ఒకరేమో పార్టీ అధ్యక్షుడు కంటే పార్టీలో సీనియర్ నేతగా చెప్పుకుంటారు.. మరొకరేమో ఎక్కడ అధికారం ఉంటే అక్కడ జంప్ అయ్యి చివరికి టీడీపీ గట్టు చేరిన నాయకుడు ఒక్కరు. పార్టీ అధికారంలో ఉన్న.. ప్రతిపక్షంలో ఉన్న ఇద్దరి దారి ఇద్దరిదే. ఈ ఇద్దరు ఎవరు కాదు మాజీ మంత్రులు అయ్యన్న, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ అయ్యన్న పాత్రుడు గంటాపై రెచ్చిపోయారు.
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ.. ఎవడండీ గంటా?లక్షలాది పార్టీ కార్యకర్తల్లో వాడొక్కడు.. అ లక్షల్లో నేనొక్కడిని.. గంటా ఏమైనా పెద్ద నాయకుడా?. ప్రధానా?. పార్టీ కోసం అందరూ పని చేయాలి. కష్టకాలంలో కూడా పార్టీ కోసం చేసిన వారే నిజమైన నాయకులు అంటూనే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ పార్టీలో కనపడుతున్నారని విమర్శించారు.
2019 టీడీపీ అధికారనికి దూరం అయినప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరం పాటిస్తూ వస్తున్నా గంటా.. అప్పుడప్పుడు వైసీపీ, బీజేపీ అంటూ లీకులు ఇచ్చుకుంటూ రాజకీయం చేసినా గంటా.. వచ్చే ఏడాది ఎన్నికలు దృష్టిలో పెట్టుకోని మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
బహుశా చంద్రబాబు మళ్లీ గంటాకు పార్టీలో ఉన్నత స్ధానం ఇస్తారనే భయం అయ్యనకు పట్టుకున్నట్లు ఉంది. అందుకే ముందు జాగ్రతగా గంటాను తిడుతూనే పార్టీ కోసం కష్టపడేవారికి అన్యాయం జరగకూడదనే చంద్రబాబును హెచ్చరించినట్లు తెలుస్తోంది.