రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సీఐడీ స్థాయి గురించి.. వివాదాస్పద నాయకుడు.. బూతులు మాట్లాడడంలో సిద్ధహస్తుడు అయ్యన్నపాత్రుడు మాట్లాడుతున్నారు.ఈ వైనం గమనించిన ఎవ్వరికైనా సరే.. ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నదనే’ సామెత గుర్తుకు వస్తే ఆశ్చర్యం లేదు.
తన ఆస్తిపత్రాలకు సంబంధించి ఫోర్జరీ సంతకాలు చేశారనే ఆరోపణలపై ఇటీవలే అరెస్టు అయి, కోర్టు ద్వారా రక్షణ పొందుతున్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంతకూ సీఐడీ స్థాయి గురించి మాట్లాడేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉన్నతమైన దర్యాప్తు సంస్థ సీఐడీ తన స్థాయిని దిగజార్చుకున్నదని జాలి కురిపించే పరిస్థితి ఎందుకు వచ్చింది..? అనేది ఇప్పుడు చర్చనీయాంశం.
అయ్యన్నపాత్రుడును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. ఇలాంటి సందర్భాలను రాజకీయంగా తమకు అనుకూలంగా వాడుకునే మాయోపాయాలు తెలుగుదేశం వద్ద చాలా పుష్కలంగా ఉంటాయి. ఒక చిన్న అరెస్టు ద్వారా.. ఎన్ని టన్నుల మైలేజీ పొందవచ్చు అనే విషయంలో వారి దగ్గర ఒక కార్యచరణ ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రకారం దూసుకెళ్లిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు వచ్చి అయ్యన్నను పరామర్శిస్తున్నారు. అరెస్టునుంచి ఇంటికి వచ్చిన నాటినుంచి.. ఈ పరామర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.
అయితే తాజాగా పరామర్శలకు వచ్చిన వారితో అయ్యన్న మాట్లాడుతూ.. ఉన్నత సంస్థ సీఐడీ తన స్థాయి దిగజార్చుకుందని వ్యాఖ్యానించారు. తనను అరెస్టు చేయగానే ప్రజలు బయటకు వచ్చి ఆందోళన చేశారని, ప్రతి విషయంలో ఇలాగే పోరాడాలని అన్నారు. తన పిల్లలపై ఎందుకు కేసులు పెట్టారని ఆవేదన కూడా వెలిబుచ్చారు.
అయినా ‘స్థాయి’ అనే పదాన్ని అయ్యన్నపాత్రుడు వాడడమే హేయంగా ఉంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే హోదాకు కూడా గౌరవం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గురించి.. నానా బూతులు మాట్లాడుతూ.. తన నీచత్వాన్ని పలుమార్లు బయటపెట్టుకున్న వ్యక్తి ఈ అయ్యన్నపాత్రుడు. ఈయనకు అసలు ఒక స్థాయి ఉందా? అనేది ప్రజల మదిలో మెదలుతున్న ప్రశ్న!
సీఐడీ స్థాయి దిగజారిందని అయ్యన్న అనడం ఒక రకంగా కరెక్టే. ఇలాంటి చీప్, చవకబారు, నేలక్లాస్ నాయకుడిని కూడా అరెస్టు చేయాల్సిన స్థాయికి దిగజారినందుకు సీఐడీ సిగ్గుపడాల్సిందే అని ప్రజలు అనుకుంటున్నారు.
బాప్ ఏక్ నెంబర్ కా అయితే.. బేటా దస్ నెంబర్ కా అన్నట్టుగా.. అయ్యన్న శైలిలోనే.. ఆయన కొడుకు చింతకాయల రాజేష్.. సోషల్ మీడియాలో రెచ్చిపోతూ.. నానా బూతులు వైసీపీ నేతల మీద ప్రచారంలో పెడుతోంటే.. పోలీసులు ఊరుకోవాలా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.