అయ్యన్న ఇలాకా నర్శీపట్నంలో మెడికల్ కాలేజికి ముఖ్యమంత్రి హోదాలో జగన్ శంకుస్థాపన చేశారు. దాంతో పాటు నర్సింగ్ కాలేజ్ అనుబంధంగా వస్తుందని వెనకబడిన ప్రాంతం నర్శీపట్నం బాగుపడుతుందని జగన్ చెప్పారు. దాంతో మాజీ మంత్రి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కి అనుమానాలు వరసగా వస్తున్నాయి.
మెడికల్ కాలేజ్ ఎలా కడతారు అంటూ ఆయన డౌట్లు లేవదీస్తున్నారు దానికి డబ్బులుండాలి కదా అని క్వశ్చన్ రైజ్ చేశారు. మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి ఉందా అంటూ మరో ప్రశ్న సంధించారు. మెడికల్ కాలేజి కడితే మంచితే భూములకు రేట్లు పెరుగుతాయని రైతులకు చెప్పానని తాను కూడా స్వాగతిస్తాను అని చెప్పిన అయ్యన్న ఇంతకీ కడతారా అని లేని పోని సందేహాలు తెర మీదకు తెస్తున్నారు.
ఇది జనాలను మోసం చేయడానికేనట. మెడికల్ కాలేజిని కడతామని జగన్ సర్కార్ చెప్పుకొస్తోంది. జిల్లాకు ఒకటి వంతున మంజూరు చేస్తోంది. గతంలో ఈ పరిస్థితి లేదు అన్న సంగతి సీనియర్ మంత్రిగా గతంలో ఉన్న అయ్యన్నకు తెలియనిది కాదు కదా అంటోంది వైసీపీ. తాను చేయలేని పనిని వైసీపీ చేస్తే ఎందుకు ఇంత కంగారు అని కూడా ఎదురు ప్రశ్నిస్తోంది.
మెడికల్ కాలేజ్ విషయంలో అయ్యన్న డౌట్లు పెట్టారు కానీ ఏలేరు 470 కోట్లతో నిర్మించే తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్ పనులకు, రూ. 16 కోట్లతో నర్సీపట్నం రహదారి విస్తరణ పనులకు జగన్ శంకుస్థాపనలు చేశారు. వాటి విషయంలో కూడా డౌట్లు ఉన్నాయా అని అడుగుతున్నారు. వాటి గురించి మరి ఎందుకు అయ్యన్న్న మాట్లాడరు అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
నిజానికి గత దశాబ్దాలుగా తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్ ఉందని, అయ్యన్న మంత్రిగా ఉండి కూడా చేయలేని పనులను తాము ఎమ్మెల్యేగా మూడేళ్ళలోనే చేశామని నర్శీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ అంటున్నారు.
ఇక తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్ పనులకు జగన్ శంకుస్థాపన చేస్తే ప్రత్యకంగా హాజరైన సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి హాట్సాఫ్ జగన్ అని సభలోనే అభినందించారు. మరి ఇవన్నీ అయ్యన్న కళ్ళకు కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నారు. అయ్యన్నకు ఈ అభివృద్ధి పనులు చూసి కంగారు పట్టుకుందని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.