బాబు సర్కార్ రెండున్నరేళ్ళే!

ఏపీలో భూమి దద్దరిల్లేలా భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ఆయుష్షు రెండున్నరేళ్ళే అని లెక్కతో సహా తేల్చేశారు వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు ప్రభుత్వానికి అయిదేళ్లు…

ఏపీలో భూమి దద్దరిల్లేలా భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ఆయుష్షు రెండున్నరేళ్ళే అని లెక్కతో సహా తేల్చేశారు వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు ప్రభుత్వానికి అయిదేళ్లు కాలపరిమితి లేదని జమిలి ఎన్నికలతో సగానికి సగం సర్కార్ ఆయుష్షు తగ్గిపోయిందని బొత్స అంటున్నారు.

అందుకే బాబు ప్రభుత్వానికి ఆరు నెలల టైం ఇద్దామని మొదట అనుకున్నా దానిని మూడు నెలలకే కుదించామని బొత్స చెప్పారు. అంతే కాకుండా ఏపీలో కేవలం నాలుగు నెలల పాలనలోనే బాబు ప్రభుత్వం అన్ని విధాలుగా విమర్శల పాలు అయిందని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలను ఏ ఒక్క దానినీ నెరవేర్చలేదని ఆయన అన్నారు.

ఉచిత ఇసుక అన్నారు, అది బంగారం కన్నా ఎక్కువై కూర్చుదని నిత్యావసర ధరలు ఆకాశానికి అంటాయని, రాష్ట్రంలో ఎటు చూసినా అంతూ పొంతూ లేని దోపిడీకి తెర తీశారని బొత్స హాట్ కామెంట్స్ చేశారు.

విజయనగరం జిల్లాలోని గుర్ల మండలంలో అతిసారాతో పదకొండు మంది బలి అయ్యారని ఇదంతా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సంభవించిన మరణాలు అని ఆయన ఆక్షేపించారు.

ఇసుక మద్యం వంటి వాటి ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారని ఆయన విమర్శించారు. రైతులకు కూటమి తరఫున భరోసా ఏదని ఆయన నిలదీశారు. తల్లిని వందనం ఏమైందని అన్నారు.

కేవలం మూడు నెలల పాలనలోనే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన ప్రభుత్వం చంద్రబాబుదని ఆయన దుయ్యబెట్టారు. జమిలి ఎన్నికలు వచ్చే వీలుందని చెబుతున్న చంద్రబాబు తనకు ప్రజలు ఇచ్చిన అయిదేళ్ల అవకాశాన్ని సగానికి తగ్గించేసుకున్నారని ఆయన అన్నారు.

ప్రజల తరఫున తాము కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజా పక్షంగా ఉంటామని కూటమి నిర్వాకాలను ఎండగడతామని బొత్స స్పష్టం చేశారు.

11 Replies to “బాబు సర్కార్ రెండున్నరేళ్ళే!”

  1. సరేలేరా నత్తి సత్తి బాబు ముందు ఏమి మాట్లాడుతున్నావో నత్తి నత్తి గా నీకైనా అర్దమవుతుంది నీ పెళ్ళాం ఎలా బరిస్తోందిరా ఎదవ నిన్ను

  2. వీడే కదా..

    గత నవంబర్ 2023 లో .. మార్చ్ 2024 లోగా టీడీపీ ని మూసేస్తారు అని బాంబు పేల్చాడు..

    ఇంతకీ ఆ బాంబు పేలిందా..?

    చూసారా.. ఆ బాంబు సంగతి మీరూ మర్చిపోయారు.. వాడు కూడా మర్చిపోయాడు..

    ఇప్పుడు ఇంకో బాంబు పేల్చడానికి ట్రై చేస్తున్నాడు..

    వాడి నత్థికి .. మీ సుత్తికి.. సరిగ్గా సరిపోతుంది..

  3. నిజం గా రెండు న్న ర ఏళ్ళు ఉండే భాగ్యనికి మన చెంచా గాళ్ళని ఎందుకు బాబాయ్ జనసేన లోకి పంపిస్తున్నావ్…

  4. వీడి రాజకీయం అయిపోయింది భూమి మీద .ఇక చాలు .జామిల్లి పెట్టేదానికి మోడీ కి బలం లేదు మూడింట రెండు మెజారిటీ ఉండాలి కాని కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా ఆ బిల్ ఆమోదం అవ్వదు .కాంగ్రెస్ మద్దతు ఇవ్వదు .సో అయిదేళ్ళు ప్రభుత్వం ఉంటుంది

    1. సోనియా గాంధీ, రాహుల్ మీద కేసులున్నాయి….మూసుకొని సపోర్ట్ చేస్తారు.

Comments are closed.