తెలుగులోకి రిషబ్ శెట్టి.. సితారలో!

తమిళ, మలయాళ హీరోలు ఇప్పటికే తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టి, ఇక్కడ మంచి గుర్తింపు పొందుతున్నారు. మార్కెటింగ్ పరంగా ఇవి మన నిర్మాతలకు చాలా లాభదాయకంగా ఉన్నాయనే చెప్పాలి. ఉపేంద్ర, సుదీప్ వంటి కన్నడ నటులు…

తమిళ, మలయాళ హీరోలు ఇప్పటికే తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టి, ఇక్కడ మంచి గుర్తింపు పొందుతున్నారు. మార్కెటింగ్ పరంగా ఇవి మన నిర్మాతలకు చాలా లాభదాయకంగా ఉన్నాయనే చెప్పాలి. ఉపేంద్ర, సుదీప్ వంటి కన్నడ నటులు ఇక్కడ కొన్ని సినిమాలు చేసినా, పెద్దగా స్థిరపడలేకపోయారు. ఇప్పుడు రిషబ్ శెట్టి వంతు వచ్చింది.

కన్నడలో మంచి పేరు తెచ్చుకుని, తెలుగు ప్రేక్షకులకు ఓటిటి ద్వారా పరిచయమైన రిషబ్ శెట్టి ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు సినిమాలను సైన్ చేసేశారు. ఒకటి మైత్రి సంస్థ – ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో “ఙై హనుమాన్” సినిమా, ఇందులో రిషబ్ హనుమాన్ పాత్రలో కనిపిస్తాడు.

రెండో సినిమా సితార సంస్థతో. ఈ సినిమాను కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తారు. రిషబ్ స్వయంగా కథను, దర్శకుడిని ఎంచుకుని సితార సంస్థకు పంపించాడట. ఈ సినిమా “ఙై హనుమాన్” కంటే ముందుగా ప్రారంభం అవుతుందట.

పారితోషికాలు, మార్కెట్ వీటిని దృష్టిలో ఉంచుకుంటే, కన్నడ మరియు మలయాళ సినిమాలతో పోలిస్తే తెలుగు సినిమాలు చాలా ముందున్నాయని చెప్పవచ్చు. అందుకే అన్ని భాషల హీరోలు తెలుగు సినిమా రంగం వైపు చూస్తున్నారు.

మంచి రెమ్యూనిరేషన్, మంచి మార్కెట్, అలాగే ఓటిటిలో మంచి రేటు కూడా అందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నేళ్లకు సౌత్ ఇండియన్ సినిమా అనే ఒకటే మిగిలి పోవచ్చని భావించవచ్చు, ప్రత్యేకంగా కన్నడ, తమిళ, మలయాళ, తెలుగు అనే భాషా పరిమితులు లేకుండా.

2 Replies to “తెలుగులోకి రిషబ్ శెట్టి.. సితారలో!”

Comments are closed.