కార్య‌క‌ర్త‌ల్లో హుషార్.. దోచుకున్నోడికి దోచుకున్నంత‌!

ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు, కాంట్రాక్టులు, ఇసుక ఇప్ప‌టికే త‌మ్ముళ్ల జేబులు నింపుతోంది. ఇప్పుడు మ‌ద్యం ప్ర‌వాహంతో వారు త‌డిసిముద్దవుతున్నారు.

తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లను నిర్ల‌క్ష్యం చేసేది ఉండ‌ద‌ని ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కొన్ని వంద‌ల సార్లు చెప్పి ఉంటారు. పార్టీ కోసం ప‌ని చేసే కార్య‌క‌ర్త‌ల కోసం ఏం చేయ‌డానికి అయినా వెనుకాడేది లేద‌ని చంద్ర‌బాబు నాయుడే కాకుండా, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ కూడా త‌ర‌చూ చెబుతూ ఉంటారు. త‌ద్వారా వారు పార్టీ కోసం ఏం చేసినా పార్టీ చూసుకుంటుంద‌ని కూడా చెప్పారు. అధికారంలో లేని స‌మ‌యంలోనే ఎన్ని కేసుల‌ను పెట్టించుకున్నా పార్టీ చూసుకుంటుంద‌ని, ఎక్కువ కేసుల‌ను పెట్టించుకున్న వారికి అధికారం ద‌క్కాకా మంచి ప‌ద‌వులు ద‌క్కుతాయంటూ కూడా భ‌రోసా ఇచ్చారు. త‌ద్వారా కార్య‌క‌ర్త‌ల‌కు చంద్ర‌బాబు నాయుడు, లోకేష్ బాబు లు క‌చ్చిత‌మైన సందేశాల‌ను అయితే ఇచ్చారు.

విశేషం ఏమిటంటే.. అధికారంలోకి వ‌చ్చాకా వారు అదే పాటిస్తున్న‌ట్టుగా ఉన్నారు. ఏపీలో ఇప్పుడు ప‌చ్చ పార్టీ కార్య‌క‌ర్త అంటే ఒక సూప‌ర్ ప‌వ‌ర్ గా మారాడు. ఇంకా జ‌న్మ‌భూమి కమిటీలు రాక‌ముందే.. ఇప్పుడు అంతా ప‌చ్చ పార్టీ క‌నుస‌న్న‌ల్లోనే నడుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు ప‌చ్చ‌బిల్ల పెట్టుకు వెళితే క‌లెక్ట‌ర్ ఆఫీసులో కూడా కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి ప‌నులు చేసి పెడ‌తారంటూ తెలుగుదేశం నేత‌లు బాహాటంగానే ప్ర‌క‌టించారు. ఇలా తెలుగుదేశం కార్య‌క‌ర్త కావ‌డం అనేది ఇప్పుడు ఏపీలో పెద్ద అర్హ‌త‌గా మారింది.

ఇంకా చంద్ర‌బాబు చెప్పిన సంక్షేమ ప‌థ‌కాల్లో పెన్ష‌న్ త‌ప్ప ఇంకా ఏదీ అమ‌లు కాలేదు. ఆ పెన్ష‌న్ ప‌థ‌కం విష‌యంలోనే పెద్ద ర‌చ్చ జ‌రిగింది. అనేక చోట్ల పెన్ష‌న్ పెరిగింది కాబ‌ట్టి, అందులో ఐదు వంద‌లో, వెయ్యి రూపాయ‌లో త‌మ‌కు ఇవ్వాలంటూ త‌మ్ముళ్లు చిల‌క్కొట్టుడు కొట్టారు. ఇక పెన్ష‌న్ల వ్య‌వహారం ఇంకోమ‌లుపు తీసుకుంటూ ఉంది. కొత్త పెన్ష‌నర్ల జాబితాలో కేవ‌లం తెలుగు త‌మ్ముళ్ల ఆమోద‌ముద్ర ఉన్న వారే చేరుతూ ఉన్నారు. ప్ర‌త్యేకించి విక‌లాంగ పెన్ష‌న్ల వ్య‌వహారంలో పెద్ద లిస్టే త‌యార‌య్యింది. అన్నీ స‌వ్యంగా ఉన్న వారు కూడా ప్ర‌భుత్వ డాక్ట‌ర్ చేత విక‌లాంగుడిగా ఆమోద‌ముద్ర వేయించుకుని వ‌స్తే చాలు కొత్త పెన్ష‌న్ కు అప్లై చేసుకోవ‌చ్చు.

స్థానికంగా తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు చేతులు త‌డ‌పాలి అద‌నంగా. ఎలాగూ వికలాంగుల పెన్ష‌న్ మొత్తం ఎక్కువ‌. అందులో రెండు మూడు నెల‌ల మొత్తాన్నిముందుగానే తెలుగుదేశం కార్య‌క‌ర్త చేతికి ఇస్తే, ప్ర‌భుత్వ డాక్ట‌ర్ కు కొంత డ‌బ్బులు ఇచ్చి విక‌లాంగ స‌ర్టిఫికెట్ తీసుకు వ‌స్తే చాలు! ఇలా గ్రామీణ ప్రాంతంలో అనేక మంది విక‌లాంగ పెన్ష‌న్ జాబితాలోకి ఎక్కేస్తున్నారు. ప‌ది వేల రూపాయ‌లు ప్ర‌భుత్వ డాక్ట‌ర్ కు, తెలుగుదేశం కార్య‌క‌ర్త‌కు ఇంకో ప‌ది వేల రూపాయ‌లు! లాంఛ‌నం పూర్తైన‌ట్టే. ఆ పై నెల‌నెలా వికలాంగ పెన్ష‌న్ తీసుకోవ‌చ్చు! ఇదంతా 2014-19ల మ‌ధ్య‌న కూడా జ‌రిగిందే. అప్పుడు కూడా జ‌న్మ‌భూమి క‌మిటీ స‌భ్యులు పార్టీల‌కు అతీతంగా ఎవ‌రి ఇంటికి అయినా వెళ్లి.. త‌మ‌కు కొంత డ‌బ్బు ఇస్తే చాలు, మీ పేరు పెన్ష‌న్ జాబితాలోకి ఎక్కిస్తామంటూ వ‌సూళ్లు చేసుకున్నారు. కొంద‌రు ఆశ‌ప‌డి వారికి డ‌బ్బులు ఇచ్చి పెన్ష‌నర్ల జాబితాలోకి త‌మ పేరును చేర్చుకున్నారు. ఆ త‌ర్వాత వెరిఫికేష‌న్లు, ఏరివేత‌లు జ‌రిగాయి. అయితే అల్టిమేట్ గా తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల జేబుల్లోకి అయితే డ‌బ్బులు చేరాయి.

ఇప్పుడు కూడా అదే జ‌రుగుతూ ఉంది. అది కూడా ఇప్పుడు పెన్ష‌న్ మొత్తం ఎక్కువ కాబ‌ట్టి, జ‌నాలు కూడా రెచ్చిపోతున్నారు. కొన్నాళ్లు పాటు పెన్షన్ వ‌చ్చినా, వీరికి చెల్లించిన మొత్తం చెల్లిపోతుందంటూ ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల వ‌ద్ద వికలాంగ స‌ర్టిఫికెట్ కోసం, పెన్ష‌న్ జాబితాలో పేర్ల కోసం తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల‌కు చెల్లించుకుంటూ ఉన్నారు. కార్య‌క‌ర్త‌లు చెప్పిన వారి పేర్లే జాబితాలో ఉంటాయి .. ఇది కూట‌మి ప్ర‌భుత్వంలో అధికారిక రాజ్యాంగం. కాబ‌ట్టి.. ఆడింది ఆట పాడింది పాట‌!

ఇలా మొద‌లుపెడితే తెలుగు త‌మ్ముళ్ల సంపాద‌న మార్గాలు బోలెడు క‌నిపిస్తూ ఉన్నాయి. ఇసుక‌, మ‌ట్టి, పెన్ష‌న్ ఇలా అన్ని మార్గాల్లోనూ వంద రోజుల్లోనే విచ్చ‌ల‌విడిగా సంపాదించుకోవ‌డం మొద‌లుపెట్టారు. ఇదంతా చంద్ర‌బాబు నాయుడు ముందుగా చెప్పిందే. త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే కార్య‌క‌ర్త‌లు చెప్పిందే జ‌రుగుతుంది అంటూ ఆయ‌న బాహాటంగానే చెప్పారు. ఇప్పుడు అదే జ‌రుగుతూ ఉంది. ఇలాంటి విష‌యాల్లో త‌మ‌కు ఎదురుతిరిగిన వారిపై ఎంత‌టి దాడుల‌కు కూడా త‌మ్ముళ్లు వెన‌కాడ‌టం లేదు కూడా.

ఇసుక మాఫియాలు, మ‌ట్టి మాఫియాలు న‌డి రోడ్ల‌పై ఎదురుతిరిగిన వారిని విప‌రీతంగా త‌న్నే స్థాయి వ‌ర‌కూ అతి వేగంగా ఎదిగాయి. వీటికి ఎమ్మెల్యేల అండ పుష్క‌లం. ఇక మ‌ద్యం ప్ర‌వాహం మొద‌లైంది. ఎంఆర్పీ ధ‌ర‌లే ప‌తాక స్థాయిలో ఉన్నాయి. అయితే ఏపీలో కొత్త మ‌ద్యం విధానం త‌ర్వాత కూడా ఎక్క‌డా ఎంఆర్పీ అమ్మ‌కాలు లేవు. ఒక్కో క్వార్ట‌ర్ బాటిల్ పై ఇర‌వై రూపాయ‌లు అద‌నం! రాష్ట్రం మొత్తం మీద ఎన్ని క్వార్ట‌ర్ లు అమ్ముడ‌వుతాయో, ఒక్కో క్వార్ట‌ర్ పై ఇర‌వై రూపాయ‌లు అంటే రోజుకు ఇదే ఎన్ని వంద‌ల కోట్ల రూపాయ‌ల‌కు చేరుతుందో అంచ‌నాలు వేయాలిక‌!

ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు, కాంట్రాక్టులు, ఇసుక ఇప్ప‌టికే త‌మ్ముళ్ల జేబులు నింపుతోంది. ఇప్పుడు మ‌ద్యం ప్ర‌వాహంతో వారు త‌డిసిముద్దవుతున్నారు. అయితే చంద్ర‌బాబు పాల‌న‌లో ఇది తుది అయితే కాదు, ఇంకా మొద‌లే, రానున్న నాలుగున్న‌రేళ్ల‌లో త‌మ్ముళ్ల జోరు త‌రాల‌కు త‌గినంత సంపాదించుకునే స్థాయిలో ఉండే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తూ ఉన్నాయి.

27 Replies to “కార్య‌క‌ర్త‌ల్లో హుషార్.. దోచుకున్నోడికి దోచుకున్నంత‌!”

  1. Everyone I spoke to recently have been very vocal about the level of looting that Kootami leaders are doing within past 4 months and some of TDP supporters are even surprised with the lenient nature of Babu and his inability to control his cadre.

    1. బులుగు మీడియా లో చదివింది ఇక్కడ కామెంట్ పెడుతున్నావ రాజా. ఒక్కటి గుర్తుంచుకో, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది లేదు, త్వరలోనే ఆ పార్టీ మూసేయటం కాయం. జమిలి ఎన్నికల్లో మళ్ళీ పునర్వైభవం వస్తుందనుకుంటున్నాడు కానీ ఆ ఎన్నికలతో చివరి అంకం ముగుస్తుంది

  2. ఇదంతా గాలి వార్తలు నిజంగా ycp పార్టీలోనే ఇలాంటి పెన్షన్లు ఎక్కువ జరిగాయి.

Comments are closed.