ప్రశాంత్ వర్మ.. ఏమిటో స్ట్రాటజీ?

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా డైరక్టర్ స్టేటస్ అందుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అ సినిమా తరువాత ఏ సినిమా అన్నది క్లారిటీ లేదు. అన్నింటికన్నా ముందుగా ఒప్పుకున్న డివివి దానయ్య కొడుకు సినిమాను…

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా డైరక్టర్ స్టేటస్ అందుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అ సినిమా తరువాత ఏ సినిమా అన్నది క్లారిటీ లేదు. అన్నింటికన్నా ముందుగా ఒప్పుకున్న డివివి దానయ్య కొడుకు సినిమాను మెల్లగా దర్శకత్వ పర్యవేక్షణకు మార్చేసారు. నందమూరి మోక్షు సినిమాకు సైన్ చేసారు. అది అలా వుండగానే హనుమాన్ సీక్వెల్- జై హనుమాన్ సినిమాను రిషబ్ శెట్టి తో ఓకె చేసుకున్నారు. ఈ మధ్యలో మహాకాళి సినిమా ప్రకటన వచ్చింది. సూపర్ హీరోయిన్ సినిమా, ఇవన్నీ ఇలా వుండగానే ప్రభాస్ తో సినిమానే భయంకరమైన గ్యాసిప్ ఒకటి.

అసలు ఎన్ని సినిమాలు చేస్తారు, ముందు ఏది? వెనుక ఏది? పైగా అన్నీ విఎఫ్ఎక్స్ పనులు ఎక్కువగా వుండే సినిమాలు. ఒక్కో సినిమాకు కనీసం ఒక్కో ఏడాదిన్నర కావాలి. మరి ఇవన్నీ ఎప్పటికి పూర్తి అవుతాయి.

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం జై హనుమాన్ సినిమా అనౌన్స్ మెంట్ ఈ నెలాఖరుకు వస్తుంది. దానికి ఏడాది ప్రీ ప్రొడక్షన్ వర్క్ వుంది. వచ్చే ఏడాది మధ్య నుంచి అ సినిమా షూట్ ప్రారంభం అవుతుంది.

ఈ లోగా మోక్షు సినిమా స్టార్ట్ చేయాలి, అందులో బాలయ్య కీలకపాత్ర వుంది. మహాభారతంలోని అభిమన్యుడి ఎపిసోడ్ తో లింక్ వుంటుంది. అందువల్ల ఇవన్నీ కూడా విఎఫ్ఎక్స్ తో కూడుకున్నవే. అందువల్ల సినిమా 2025 కు విడుదల అవుతుందా అన్నది చూడాలి.

అలాగే రిషబ్ ది మొదలైతే 2026 కో 2027 కు రావచ్చేమో.. ఇవన్నీ ఇలా వుంచితే పాపం, దానయ్య కొడుకు సినిమా పరిస్థితి ఏమిటో? కేవలం దర్శకత్వ పర్యవేక్షణ అని మాత్రమేనా, నిజంగా ప్రశాంత్ వర్మకు టైమ్ వుంటుందా?

అసలు ఇలా గజిబిజిగా అన్ని సినిమాలు ఒకేసారి ప్రకటించడం వెనుక ప్రశాంత్ వర్మ స్ట్రాటజీ ఏమిటో?

6 Replies to “ప్రశాంత్ వర్మ.. ఏమిటో స్ట్రాటజీ?”

  1. ఒక్క సినిమా తో మరీ అంత మోసెయ్యకండి GA గారూ… ఈయన ఇంకా చాలా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. హనుమాన్ గొప్ప మూవీ ఏం కాదు. అదృష్టవశాత్తు ఆడేసింది… ఇంకో రెండు మూడు సినిమాలు ఓపిక పట్టి అప్పుడు మోసెయ్యండి.

Comments are closed.