ప్రభాస్ సెకెండ్ రౌండ్?

ఆదిపురుష్ కంటే ముందు ఒకేసారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటించాడు ప్రభాస్. వాటినే ఇప్పటివరకు వరుసగా చేసుకుంటూ వస్తున్నాడు. అలా ప్రకటించిన సినిమాల్లో కల్కి-1, సలార్-1 లాంటివి రిలీజయ్యాయి. రాజాసాబ్ దాదాపు కొలిక్కి…

ఆదిపురుష్ కంటే ముందు ఒకేసారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటించాడు ప్రభాస్. వాటినే ఇప్పటివరకు వరుసగా చేసుకుంటూ వస్తున్నాడు. అలా ప్రకటించిన సినిమాల్లో కల్కి-1, సలార్-1 లాంటివి రిలీజయ్యాయి. రాజాసాబ్ దాదాపు కొలిక్కి వచ్చింది. వచ్చే ఏడాది స్పిరిట్ సెట్స్ పైకి వస్తుంది.

ఇప్పుడు రౌండ్-2కు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే హను రాఘవపూడి సినిమాను ఎనౌన్స్ చేసి, లాంఛ్ చేసిన ఈ హీరో.. తన పాత స్టయిల్ లోనే ఒకేసారి 2-3 సినిమాల్ని ప్రకటించి, వాటి పనుల్లో పడాలని భావిస్తున్నాడు. రౌండ్-2లో ప్రశాంత్ వర్మ, లోకేష్ కనగరాజ్, అట్లీ లాంటి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.

మరికొన్ని రోజుల్లో తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు ఈ హీరో. బర్త్ డే స్పెషల్ గా ‘రాజా సాబ్’ నుంచి ఓ వీడియో రెడీ అవుతోంది. హను రాఘవపూడి సినిమా, కల్కి-2 నుంచి కూడా అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ఓ కొత్త సినిమా ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉంది.

మరి పెళ్లి సంగతేంటి..?

వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలోనే పెళ్లి చేసుకుంటాడని, ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఇదివరకే ప్రకటించారు. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాల బట్టి చూస్తుంటే, ప్రభాస్ ఇంకోసారి సినిమాలతో ఫుల్ బిజీ అయ్యేలా ఉన్నాడు. పెళ్లి సంగతి పక్కనపెడితే, కొత్త సినిమాలు ప్రకటిస్తాడనే ప్రచారంతో, ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

3 Replies to “ప్రభాస్ సెకెండ్ రౌండ్?”

Comments are closed.