ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద ఓటీటీ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతున్న జియో సినిమా కనుమరుగు అవుతుందా? అవుతుందనే అంటున్నారు చాలామంది. నిజానికి ఇది ఊహించని మార్పు.
కొన్ని నెలల కిందట డిస్నీ హాట్ స్టార్ యాజమాన్య హక్కులను రిలయెన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 70వేల కోట్ల రూపాయల విలువైన ఈ విలీన ప్రక్రియ, వచ్చే ఏడాది మార్చి నాటికి ముగుస్తుంది.
అయితే రిలయన్స్ కు చెందిన జియో సినిమా, డిస్నీకి చెందిన హాట్ స్టార్ యాప్స్ పై చాలా చర్చ నడిచింది. ఈ రెండు ఓటీటీ వేదికల్ని ఇలానే కొనసాగిస్తారా.. లేక హాట్ స్టార్ ను జియో సినిమాలో విలీనం చేస్తారా అనే చర్చ నడిచింది.
అయితే ఆశ్చర్యంగా జియో సినిమాను డిస్నీ హాట్ స్టార్ లో విలీనం చేయాలని రిలయన్స్ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో జియో సినిమా కనిపించదు. ఈ రెండు ఓటీటీల స్థానంలో జియో హాట్ స్టార్ అనే కొత్త పేరును ప్రవేశపెట్టాలని రిలయన్స్ భావిస్తోంది.
నిజానికి హాట్ స్టార్ అనే పేరునే లేకుండా చేయాలనుకున్నారు. కానీ జియోతో పోలిస్తే డిస్నీ హాట్ స్టార్ యాప్ లో టెక్నాలజీ చాలా అడ్వాన్స్ డ్ గా ఉంది. అంతేకాదు, చందాదారులు, డౌన్ లోడ్స్ పరంగా కూడా జియోతో పోలిస్తే, హాట్ స్టార్ ఎంతో మెరుగ్గా ఉంది. అందుకే జియో సినిమానే హాట్ స్టార్ లో విలీనం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
డిస్నీ హాట్ స్టార్ కు 50 కోట్లకు పైగా యాప్ డౌన్ లోడ్స్ ఉన్నాయి. జియో సినిమాకు కేవలం 10 కోట్ల యాప్ డౌన్ లోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో యాక్టివ్ లో లేని డౌన్ లోడ్స్ కోటికి పైగా ఉన్నాయి. పూర్తిస్థాయిలో సబ్ స్క్రిప్షన్ పెట్టిన తర్వాత జియో సినిమా డౌన్ అయింది. అదే హాట్ స్టార్ విషయానికొస్తే, జియో కంటే 24 రెట్లు ఎక్కువగా చందాదారులున్నారు.
vc estanu 9380537747
ఆశ ని బొక్క లో వేశారా???!!!!భవాని వచ్చింది…
??
Lol…i thought the dame
Call boy jobs available 9989793850
థియేటర్ లు కనుమరుగు
Big compitition from Amazon prime,netflix