వివేకా హ‌త్య కేసులో నిందితుడికి బెయిల్‌!

దివంగ‌త మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు నిందితుడు గ‌జ్జ‌ల ఉద‌య్‌కుమార్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. హ‌త్య కేసులో ఉద‌య్ ఏ6 నిందితుడు. దాదాపు 16 నెల‌ల క్రితం ఉద‌య్‌కుమార్‌రెడ్డిని పులివెందుల‌లో సీబీఐ అధికారులు…

దివంగ‌త మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు నిందితుడు గ‌జ్జ‌ల ఉద‌య్‌కుమార్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. హ‌త్య కేసులో ఉద‌య్ ఏ6 నిందితుడు. దాదాపు 16 నెల‌ల క్రితం ఉద‌య్‌కుమార్‌రెడ్డిని పులివెందుల‌లో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంత‌రం క‌డ‌ప సెంట్ర‌ల్ జైల్ గెస్ట్ హౌస్‌లో విచారించారు.

ఈ నేప‌థ్యంలో బెయిల్ కోసం ప‌లు ద‌ఫాలుగా ఉద‌య్ న్యాయ పోరాటం చేశారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌కు ఊర‌ట ద‌క్క‌లేదు. మ‌రోసారి ఆయ‌న బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. సీబీఐతో పాటు వివేకా కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వొద్ద‌ని తెలంగాణ హైకోర్టులో వాదించారు.

గ‌తంలో ఇత‌ను సాక్షుల‌ను బెదిరించాడ‌ని కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది. అలాగే నిందితులైన దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డి, క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు పిటిష‌న్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయ‌ని డాక్ట‌ర్ సునీత త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు. కావున ఉద‌య్‌కుమార్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్ద‌ని కోరారు.

ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న హైకోర్టు తీర్పు రిజ‌ర్వ్ చేసింది. ఇవాళ కీల‌క తీర్పు వెలువ‌రించింది. ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్త‌ర్వులు వెలువ‌రించింది. ప్ర‌తి వారం పులివెందుల పోలీస్‌స్టేష‌న్‌లో రిపోర్ట్ చేయాల్సిందిగా తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అలాగే సాక్షుల్ని ప్ర‌భావితం చేయ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది. ఇవి ఉల్లంఘిస్తే అరెస్ట్‌కు ఆదేశాలు ఇస్తామ‌ని హెచ్చ‌రించింది.

3 Replies to “వివేకా హ‌త్య కేసులో నిందితుడికి బెయిల్‌!”

Comments are closed.