‘జ్యోతి’చూస్తోంది.. జ‌ర జాగ్రత్త!

ఆంధ్రలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసింది. తొంభై శాతం మీడియా మొత్తం పాజివిటీతో ఊగిపోతోంది. తెలుగుదేశం ప్రభుత్వం చిన్న చిన్న నిర్ణయాలకు కూడా సంబరపడిపోయి, అద్భుతమైన కథనాలుగా వండి వారుస్తోంది. ఇలాంటివి అన్నీ గత ప్రభుత్వంలో…

ఆంధ్రలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసింది. తొంభై శాతం మీడియా మొత్తం పాజివిటీతో ఊగిపోతోంది. తెలుగుదేశం ప్రభుత్వం చిన్న చిన్న నిర్ణయాలకు కూడా సంబరపడిపోయి, అద్భుతమైన కథనాలుగా వండి వారుస్తోంది. ఇలాంటివి అన్నీ గత ప్రభుత్వంలో కూడా జ‌రిగాయి. అప్పుడు పెట్టుకున్న కళ్లజోడు వేరే రకం కనుక కనిపించలేదు. అది వేరే సంగతి.

ఇప్పుడు అధికారం మారింది. ఇప్పటి వరకు అధికారం చెలాయించిన వాళ్లు పక్కకు జ‌రిగారు. కొత్త వాళ్లు రంగంలోకి వచ్చారు. ఎన్నికల కోసం అంతా కోట్లకు కోట్లు ఖర్చు చేసారు. అందువల్ల ఆకలి మామూలుగా వుండదు. అందుకే డబ్బు వచ్చే దందాల మీద దృష్టి పెట్టేసారు.

ఇక్కడ ధీమా ఏమిటంటే మీడియా అంతా తమదే కదా.. ఏమీ రాయరు అని. ఇక సోషల్ మీడియాలోని తెలుగుదేశం హ్యాండిల్స్ అన్నీ ఇప్పటికీ జ‌గన్ ను తిట్టడంతోనే కాలక్షేపం చేస్తున్నాయి. అయిదేళ్లు అధికారపక్షాన్ని తిట్టాయి. కానీ ఇప్పుడు ఏం చేయాలి. ఖాళీగా వుండలేరు. అలా అని తిట్టలేరు. అందుకే జ‌గన్ నే తిడుతూ కాలక్షేపం చేస్తున్నాయి ఈ హ్యాండిల్స్ అన్నీ. అందువల్ల ఇక తమకు అడ్డేముంది అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్లంతా జాగ్రత్తగా వుండాలేమో? ఆంధ్రజ్యోతి వాళ్ల మీద ఓ కన్నేసి వుంచింది. ఎక్కెడెక్కడ ఎవరెవరు ఏయే దందాలు చేస్తున్నారో ఈ రోజు శాంపిల్ గా ఓ వార్త అందించింది. వైకాపా జ‌నాల అవలక్షణాలు అన్నీ జ‌స్ట్ రుచి చూపించారు. ఇది ఎందుకు చేసారు. దీని వెనుక మీడియా నిజాబితీ వుందా? తెలుగు దేశం మీద అలక వుందా? ఇది ఇలా కొనసాగుతుందా? పురిట్లోనో ముగుస్తుందా? అన్నది క్వశ్చను కాదు.

తెలుగుదేశం ఎమ్మెల్యేలు, సాక్షి చూస్తోందన్న భయం పెట్టుకోనక్కర లేదు కానీ జ్యోతి చూస్తోందన్న భయం కచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం అనుకూలంగా వుంటుందని పేరు పడిన జ్యోతి ఈ విషయం చెప్పినపుడు జ‌నం నమ్ముతారు కదా? అక్కడ భయపడాలి.

నిజానికి సాక్షి మీడియా కొన్నాళ్లు సైలంట్ గా వుండడం బెటర్. ఎందుకంటే ఇప్పటి నుంచీ ఇది తప్పు అది తప్పు అని చెబుతూ పోతే ఎవరూ నమ్మరు..పైగా అసూయ అనుకుంటారు. అదే కనుక తెలుగుదేశం పార్టీ అంటే అభిమానించే మీడియా చేస్తే జ‌నాలకు ఎలా కన్వే కావాలో అలా కన్వే అవుతుంది.

11 Replies to “‘జ్యోతి’చూస్తోంది.. జ‌ర జాగ్రత్త!”

  1. నాకు తెలిసిన మ్యాటర్ నిజమే ..అయితే. రాధాకృష్ణ కి లోకేష్ కి చెడింది .. ఇది కన్ఫాం

Comments are closed.