వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పార్టీని వీడనున్నారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. ఈవీఎంలపై బాలినేని పోరు సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ తనకు పార్టీ నుంచి తగిన ప్రోత్సాహం లేదని, కనీసం జగన్ నుంచి ఒక ఫోన్ కాల్ కూడా లేదని ఆయన చెప్పడం వెనుక వ్యూహం వేరే వుందనే టాక్ వినిపిస్తోంది.
వైసీపీని వీడే క్రమంలో అందుకు తగ్గ కారణాల్ని ఆయన బిల్డప్ చేసుకుంటున్నారని వైసీపీ అనుమానిస్తోంది. మరీ ముఖ్యంగా ఒంగోలు జిల్లా బాధ్యతల్ని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఇస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీలో ఉండనని గతంలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు నేరుగా బాలినేని తేల్చి చెప్పారు. అయినప్పటికీ జగన్ వైఖరిలో మార్పు లేదని, తిరుపతి జిల్లా నుంచి చెవిరెడ్డిని తీసుకొచ్చి తమపై రుద్దుతామంటే ఎలా అని బాలినేని నిలదీస్తున్నారు.
మరోవైపు బాలినేనికి ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, పదేపదే అలకబూనడం, అధిష్టానంపై ఆరోపణలు గుప్పించడంపై జగన్ సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. ఇక బాలినేనిని భరించలేమనే నిర్ణయానికి వైసీపీ అధిష్టానం వచ్చినట్టు సమాచారం. మరోవైపు బాలినేని కూడా తన ఏర్పాట్లు చేసుకున్నారని తెలిసింది. పవన్‌కల్యాణ్‌తో ఆయనకు మొదటి నుంచి మంచి సంబంధాలున్నాయి. అందుకే జనసేనలో చేరడానికి ఆయన సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. అదే నిజం కావడానికి కౌంట్ డౌన్ మొదలైనట్టే.
అయితే బాలినేనిని జనసేనలో చేర్చుకోవద్దని ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ, జనసేన నేతలు పవన్‌కల్యాణ్‌కు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ బాలినేని విషయంలో పవన్‌కల్యాణ్ సానుకూలంగా ఉన్నారు. బాలినేనిపై ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని పరిస్థితిలో పవన్ లేరన్నది వాస్తవం.
Call boy jobs available 8341510897
ఎలేచ్షన్స్ ముందర ఇలాగె మార్చారు .. రోగం ఒక దగ్గర మందు ఇంకో దగ్గర ..
Party lo andaru veedipotharu ..okka great andhra tappithe…Balineni jsp lo join ayyithe better…YCP HAS no future
ఓడిపోయినా జగన్ రెడ్డి నీచ రాజకీయాలు అరాచకాలు ఇంకా తగ్గలేదు ఇది మరీ బాధాకరం
JSP better …YCP lo chala avamanincharu.
బాలినేని గారు హుందా గా వ్యవహరిస్తారు. దిగజారి మాట్లాడరు. I think JSP is better ఆప్షన్. JSP కూడా ఒంగోలు లో బలపడుతుంది.