ఈ బ్లాక్ అండ్ వైట్ రూట్ భలే వుంది కదా

నల్ల డబ్బులు తెల్లవిగా మారడానికి బోలెడు దారులు వుంటాయి. ఇలాంటి ఓ రూటు సంగతి చూద్దాం. టాలీవుడ్ లోని ఓ బడా నిర్మాణ సంస్థ. సినిమా అన్నాక ఫండింగ్ కావాలి. కానీ లోకల్ ఫైనాన్సియర్లు…

నల్ల డబ్బులు తెల్లవిగా మారడానికి బోలెడు దారులు వుంటాయి. ఇలాంటి ఓ రూటు సంగతి చూద్దాం. టాలీవుడ్ లోని ఓ బడా నిర్మాణ సంస్థ. సినిమా అన్నాక ఫండింగ్ కావాలి. కానీ లోకల్ ఫైనాన్సియర్లు అంతా రెండు రూపాయల వడ్డీ తీసుకుంటారు. కానీ ఒక పొలిటికల్ నేత జ‌స్ట్ 60 పైసల వడ్డీకే అప్పు ఇస్తారని తెలుస్తోంది.

మరి అలా ఇచ్చిన అప్పు బ్లాక్ కదా.. వైట్ ఎలా అవుతుంది. దానికి మార్గం వుంది. ఈ నల్లధనాన్ని మరో నిర్మాతకు ఇస్తారు. సదరు నిర్మాతకు వడ్డీ వ్యాపారం కూడా వుంది. అందువల్ల చాలా అంటే చాలా లీస్ట్ వడ్డీకే అంటే 25 పైసల లెక్కన అప్పు ఇచ్చినట్లు రికార్డుల్లో చూపిస్తారు. పనైపోయిన తరువాత అఫీషియల్ గా అప్పు తీర్చేసి, తమ బ్లాక్ తాము తీసుకుంటారు. దాన్ని మళ్లీ ఎక్కడ తెచ్చారో అక్కడికి పంపేస్తారు. 60 పైసలు ప్లస్ 25 పైసలు అంటే 85 పైసల వడ్డీకే అప్పు లభించినట్లు అన్నమాట.

ఇలా మధ్యలో వుండి అప్పు ఇప్పిస్తూ, అన్ని విధాలా సాయం చేస్తున్న వారికి ఏదో రూపంలో చేయాల్సిన సాయం కూడా ఎలాగూ చేస్తారు. బ్లాక్ ను అసలు వైట్ చేయడం ఎందుకు, అలాగే నిర్మాణానికి ఖర్చు చేయవచ్చు కదా అనే అనుమానం వుండొచ్చు.

మొత్తం బ్లాక్ తోనే సినిమా చేయడం అన్నది పాజిబుల్ కాదు కదా.. అందుకే ఇలాంటి మార్గాలు అన్నీ.

3 Replies to “ఈ బ్లాక్ అండ్ వైట్ రూట్ భలే వుంది కదా”

Comments are closed.