అరాచ‌కం @కూట‌మి పాల‌న‌

పోయింది వైసీపీ ప్ర‌భుత్వ‌మే త‌ప్ప‌, అరాచ‌కం కాద‌ని కూట‌మి పాల‌న‌ నిరూపించింది.

పోయింది వైసీపీ ప్ర‌భుత్వ‌మే త‌ప్ప‌, అరాచ‌కం కాద‌ని కూట‌మి పాల‌న‌ నిరూపించింది. వైసీపీ పాల‌న‌లో ఘోరాలు, నేరాలు జ‌రిగాయ‌ని, తమ పాల‌న‌లో అంద‌రూ సుఖ‌సంతోషాల‌తో బ‌తికేలా న‌డుచుకుంటామ‌ని కూట‌మి నేత‌లు గొప్ప‌లు చెప్పారు. కానీ ఆచ‌ర‌ణ‌లో మాత్రం అలాంటి ప‌రిస్థితి లేద‌ని కొన్ని ఘ‌ట‌న‌లు సాక్షిగా నిల‌వ‌డం గ‌మ‌నార్హం.

కేవ‌లం ఎమ్మెల్యే భార్య అనే హోదాతో, అధికార ద‌ర్పం ప్ర‌ద‌ర్శించిన వైనం చిల‌క‌లూరిపేట‌లో వెలుగు చూసింది. చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే ప‌త్తిపాటి పుల్లారావు భార్య పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని పోలీసు అధికారులు చేసిన హ‌డావుడిని చూసి, జ‌నం ముక్కున వేలేసుకున్నారు.

అలాగే తాడిప‌త్రి రూర‌ల్ సీఐపైకి ఎమ్మెల్యే అస్మిత్‌రెడ్డి త‌న అనుచ‌రుల‌తో దండెత్తిన వైనం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. అధికారంలో ఉన్నామ‌ని, మ‌రీ ఇంత దౌర్జ‌న్య‌మా? అనే చ‌ర్చ‌కు దారి తీసింది. ఇదే సంద‌ర్భంలో క‌డ‌ప మేయ‌ర్ సురేష్‌బాబు ఇంటిపైకి త‌న అనుచ‌రుల్ని ఉసిగొల్పి, అక్క‌డ చెత్త వేయించిన ఎమ్మెల్యే మాధ‌వీరెడ్డి తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లే.

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి భర్త గళ్లా రామచంద్రరావు మ‌రో అడుగు ముందుకేశారు. తాను చెప్పిన రేటుకే నాలుగు ఎక‌రాల భూమిని రిజిస్ట్రేష‌న్ చేయించాలంటూ ఒక కుటుంబంపై బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. కేవ‌లం 70 రోజుల కూట‌మి పాల‌న‌లో.. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌ను గుర్తు చేస్తుంద‌నే మాట ప్ర‌తి ఒక్క‌రి నోట వినిపిస్తోంది. జ‌గ‌న్ వ‌ద్ద‌నుకుని బాబును అధికారంలోకి తెచ్చుకుంటే, గ‌త పాల‌నే మేల‌నిపించేలా ప్ర‌స్తుత ప‌రిస్థితులున్నాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే ప‌త్తిపాటి పుల్లారావు భార్య వెంక‌ట‌కుమారిది ఈ నెల 27న పుట్టిన రోజు. ఎమ్మెల్యే గారి భార్య అని త‌ప్ప‌, మ‌రే హోదా ఆమెకి లేదు. అయిన‌ప్ప‌టికీ ఇద్ద‌రు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, ఒక ఎక్సైజ్ సీఐ ఫుల్ యూనిఫామ్‌తో హాజ‌రై కేక్ క‌ట్ చేసి పుట్టిన రోజు వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ ధోర‌ణిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి తన తండ్రి ప్ర‌భాక‌ర్‌రెడ్డికి మించిపోయారు. అనుచ‌రుల‌తో క‌లిసి ఏకంగా పోలీస్‌స్టేష‌న్‌పైకి దండెత్తారు. ఇసుక అక్ర‌మ ర‌వాణా విష‌యంలో త‌న ఆదేశాల‌ను సీఐ ల‌క్ష్మీకాంత్‌రెడ్డి ఖాత‌రు చేయ‌క‌పోవ‌డ‌మే కాకుండా, ఎమ్మెల్యే అయితే ఏంటి? అని నిల‌దీశార‌ని అస్మిత్‌రెడ్డికి కోపం వ‌చ్చింది. పోలీస్‌స్టేష‌న్ వ‌ద్ద గంట‌ల త‌ర‌బ‌డి అనుచ‌రుల‌తో క‌లిసి ధ‌ర్నా చేశారాయ‌న‌. అంతేకాదు, యల్లనూరు రోడ్డులోని సీఐ ఇంటిని ముట్టడించి, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు.

గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధ‌వి భ‌ర్త గ‌ళ్లా రామ‌చంద్ర‌రావు దౌర్జ‌న్యం ప‌రాకాష్ట‌కు చేరింది. క్రోసూరు మండ‌లం పీస‌పాడుకు చెందిన క‌మ్మ వెంకట్రావు త‌న‌కు ఎమ్మెల్యే భ‌ర్త, ఆయ‌న అనుచ‌రుల బెదిరింపుల‌పై తీవ్రంగా వాపోయారు. అంతేకాదు, త‌న‌ను, త‌న కొడుకును బైక్‌తో ఢీకొట్టి, కింద‌ప‌డిపోయినా విడిచి పెట్ట‌కుండా చ‌చ్చేంత‌గా కొట్టార‌ని క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. ఫిర్యాదు చేయ‌డానికి వెళితే పోలీసులు తీసుకోలేద‌ని ఆయ‌న అన్నారు. చివ‌రికి ఎమ్మెల్యే భ‌ర్త నుంచి ప్రాణ‌హాని వుంద‌ని, కాపాడాల‌ని కోర్టును ఆశ్ర‌యించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఈ గొడ‌వంతా పిడుగురాళ్ల స‌మీపంలోని నాలుగు ఎక‌రాల భూమి కోసం. ఎక‌రం రూ.48 ల‌క్ష‌ల వ‌ర‌కు ధ‌ర ప‌లికే భూమిని అప్ప‌నంగా రాసివ్వాల‌ని ఎమ్మెల్యే భ‌ర్త దౌర్జ‌న్యం చేస్తున్న‌ట్టు బాధితుడు వాపోయారు. నాలుగు ఎక‌రాలు క‌లిపి కేవ‌లం రూ.30 ల‌క్ష‌లు తీసుకుని రిజిస్ట్రేష‌న్ చేయించాల‌ని గ‌ళ్లా రామ‌చంద్ర‌రావు, ఆయ‌న అనుచ‌రులు తీవ్రంగా వేధిస్తున్న‌ట్టు క‌మ్మ వెంక‌ట్రావు వాపోయారు.

ఈ దౌర్జ‌న్యాల‌న్నీ చూస్తే, గ‌త పాల‌న‌పై కూట‌మి నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌లు వింటే… వీళ్లేం త‌క్కువ కాదులే అనే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో బ‌ల‌ప‌డుతోంది. ఇంకా వెలుగులోకి రాని అరాచ‌కాలు చాలా ఉన్నాయి. కేవ‌లం 70 రోజుల పాల‌న‌లోనే ఇలా వుంటే, ఇక రానున్న రోజుల్లో ఎలా వుంటుందో అనే భ‌యాందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

61 Replies to “అరాచ‌కం @కూట‌మి పాల‌న‌”

  1. విజయ సాయి రెడ్డి కొత్తగా మళ్ళీ తండ్రి అయినా విషయం రాయనే లేదు..

    దువ్వాడ శ్రీనివాస్ దువ్వూరు గురించి రాయనే లేదు..

    వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు అంగాంగ ప్రదర్శన గురించి రాయనే లేదు..

    ఇవన్నీ.. పచ్చ మీడియా లో వచ్చినవే.. అయినా తమరికి కనపడలేదు..

    టీడీపీ కి వ్యతిరేకంగా కూడా పచ్చ మీడియా లోనే వచ్చిందే.. దాన్ని పట్టుకుని.. తమరు ఆర్టికల్ వండేసుకొన్నారు..

    ఇలాగే అదే పచ్చ మీడియా వైసీపీ ప్రభుత్వం లో ఉన్నప్పుడు కూడా రాసింది.. అప్పుడు మీకు ఆ పచ్చ రాతలన్నీ తప్పుడు రాతలుగా.. భూతులుగా.. అన్యాయం గా కనిపించాయి..

    ఇప్పుడు మాత్రం పరమానందభరితులవుతున్నావు..

    మీడియా ఒక్కటే.. ప్రభుత్వం లో తప్పులు ఎత్తి చూపితే.. సరిదిద్దుకొనే అవకాశం ఉంటుంది..

    మీ జగన్ రెడ్డి ప్రభుత్వం ఆ పని చేయలేదు.. పైగా.. రివర్స్ లో మీడియా మీద కత్తి దూశారు..

    ఇప్పుడు అదే పచ్చ మీడియా సంకలు నాకుతున్నారు..

      1. అవునా.. మరి మూడేసి పెళ్లిళ్లు అంటూ ఎన్నికలకు ముందు డప్పు మెళ్ళో కట్టుకుని ఊరూరా డప్పు కొట్టుకుంటూ తిరిగి చెప్పిన జగన్ రెడ్డికి ఈ విషయం తెలియదనుకుంటా..

        తమరు అర్జెంటు గా బెంగుళూరు వెళ్లి చెప్పేసి రండి.. గుడ్ లక్ ..

        1. Adi kadu ra , minor girl body Ekkada happy. Sugali preetji incident 2017 aithe vadu ippudu anedi endi ra. 2017 partner kada , appudu intlo ‘em pettukunnadu

  2. ఇంతకీ మన Y.-.C.-.P నాయకులు వెదించిన ఆ ముంబై నటి ఎవరు? అదె TDP చెస్తె ఇప్పటికె 10 ఆర్టికల్స్ రాసెవడిని, మరి Y.-.C.-.P అయిపొయె, ఎమి చెస్తాం అంటవా?

    .

    అయినా దొం.-గ కె.-.సులొ నటిని కూడా ఎకంగా జై.-.ల్ కి కూడా పంపించటం ఎమిటి అయ్యా!

  3. ఇవి అన్నీ చాల చిన్న అరాచకాలు ఒక పల్లి తో సమానం..అసలు అరాచకం అంటే

    1. రాజధానిలో ఉన్న రోడ్లు తవ్వుకోవటం

    2. Isuka apesi apyna anna canteen lu ettiveyyatam

    3.పెడల భూములు లాక్కోవటం

    4.రాష్ట్రాన్ని బ్రస్తు పట్టించి అప్పులు చేసి పంచిపెట్టటం ముందు ఇవి అన్నీ పల్లీలు

  4. ///పొయింది Y._.C_._P ప్రబుత్వమె తప్ప, అరాచకం కాదు///

    .

    మొదటి వాక్యం తొనె Y._.C_._P ప్రభుత్వం లొ అంతా అరాచకమె అని ఒప్పుకున్నవ్ సంతొషం.

    ఇక ఈ ప్రభుత్వం ఎవరు తొక జాడించినా అధినాయకుడు ఊరుకొడు. క్రిందటి ప్రభుత్వం లొ స్వయంగా (క)సాయి రెడ్డి నె ఎన్ని కబ్జాలు చెసాడు? ఎందరు మొర పెట్టుకునా ఎమన్నా జగన్ ఆపారా?

    .

    ఈ ప్రభుత్వం లొ అలా జరగదు!

  5. pettina dabbulu sampadinhukovali kada . already ration delaers chethulu maripoyaei . mid day meals agencies chenge ayyaei . sand lo dochukuta vunaru . liquor join avutha vundi . prabhuthya shops thesestharu ani vinapadutha vundi . ade jarigithe thammullaki pandaga inka ha ha

  6. కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నంలో గత వైసిపి ప్రభుత్వం లో ఎన్నో అరాచకాలు జరిగాయి అని ఇప్పటికైనా అంగీకరించారు సంతోషం

    అలాగే ఇక్కడ మూడు ఇన్సిడెంట్లు రాశావు

    1 పుల్లారావు గారి భార్య జన్మదిన వేడుకల్లో పోలీసులు పాల్గొన్నారు జస్ట్ వాళ్లు పాల్గొన్నారు అని అంతే వాళ్లేమీ పోలీస్ స్టేషన్ లోనో వేరే చోటనో ప్రత్యేకంగా నిర్వహించలేదు పుల్లారావు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్లు కూడా అక్కడ ఉంటే వాటిలో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు–

    కానీ గతంలో పోలీస్ స్టేషన్లోనే రౌడీషీటర్ల జన్మదిన వేడుకలు నిర్వహించారు

  7. There is no incident in earlier govt like celebrating mla wife birthday sorrounded by police, also there is nothing like mla asking CI to apolize (CI apolized publicly to mla) and destroying CI house cc cameras. One may refer today andhrajyothy main edition.

    1. much more worse incidents happen like with out any reason arresting leaders , machrala attack on buddha venakanna bonda uma, Beating RRR at midnight pattabhi kidanap so many such .my dera english professor you might have forgotten al such incidents now acting innocent

  8. పర్లేదు…. మాకు గొఱ్ఱె దరిద్రం వదిలింది.. ఇంత అన్నం దొరుకుతుంది….. చీడ ముం…..డా వెదవ jag…..laq

  9. Looks likenleaders are confident trusting EVMs and the manipulation techniques but time will not always favor one side and anyone with such a huge mandate should learn to be humble especially people in public life or else they will be on the receiving end another day.

  10. చిలకలూరిపేట లో వ్యాపారుల నుండి వెంకాయమ్మ టాక్సు వసూళ్లు చేస్తున్నారు అంట 😁

  11. I think it is not correct for Tadipatri CI to misbehave with MLA, he deserves punishment.

    This birthday celebration is not an issue but policulu kaka padataru, telsina vishayame kada. Next time if they really want to celebrate, ask them to bring a decent cake, this looks very cheap, Rs 500.

      1. For the sake of argument, let us assume all these sand smugglers belong to TDP, but see its MLA and cadre agitated to arrest them at PS. Have you come across such display of public service during YCP Govt? No! That is the difference.

      2. For the sake of argument, let us assume all these sand smu/gglers belong to TDP, but see its MLA and cadre agitated to arr3st them at PS. Have you come across such display of public service during YCP Govt? No! That is the difference.

      3. For the sake of argument, let us assume all these sand smu/gglers belong to TDP, but see its MLA and cadre agitated to arr/3st them at PS. Have you come across such display of public service during Y/C/P G0vt? No! That is the difference.

      4. For the sake of argument, let us assume all these sand smu/gglers belong to TDP, but see its MLA and cadre agitated to arr3st them at PS. That is the difference.

  12. Public money, machinery and infrastructure is wasted now in broad day light but kootami supporters who had been barking in last 5 years had magically gone silent. When it wass waste then how did it become investment now?

  13. ఉన్న 3 విషయాలనే, తిప్పి తిప్పి ఇంత పెద్ద వ్యాసం రాశారు, మరి అన్నయ్య ఢిల్లీ దాకా పోయి నెత్తి నోరు బాదుకున్న 36 హత్యల గురించి ఒక సీరియల్ రాయాలి కదా, లేదే? అంటే అన్నయ్య చెప్పేదంతా బుస్ అని GA ఒప్పుకున్నట్లే!

  14. నాకు తెలిసిన మ్యాటర్ నిజమే ..అయితే. రాధాకృష్ణ కి లోకేష్ కి చెడింది .. ఇది కన్ఫాం

  15. సహజంగా ఎంఎల్ఏ ని పోలిసులు యూనిఫాం తోనే రోజూ కలుస్తుంటారు.

    అక్కడే ఎంఎల్ఏ గారి సతీమణి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి.

    కలెక్టర్ ఆ సమయానికి వచ్చినా విష్ చేస్తారు.

    అక్కడ జరిగింది అదే.

    అక్కడే జరుగుతున్న వేడుకల్ని వాళ్ళే నిర్వహించారు అని కల్పిత కథలు బయటకి రావడం ఎంతవరకు సబబు.పోలీసులు ప్రోటోకాల్ లేనివాళ్ళని విష్ చెయ్యకూడదా?

    అక్కడేదో పోలీస్ వ్యవస్థకి అవమానం జరిగినట్టు,అక్కడేదో జరగరాని అన్యాయం జరిగినట్టు గగ్గోలు పెట్టటం..ఏంది ఇది?

    గతంలో 2019-2024 మన పాలనలో పోల సు స్టేషన్లో వీ ధి రౌ డీ ల పుట్టిన రోజులు పోలీసులు చేసారు కదరా సామీ. పుట్టిన రోజుకు పోలీసులను ఇన్వైట్ చేస్తే తప్పేముంది. అందరిలాగే వాళ్ళు వచ్చుంటారు కదా. శాంతి భద్రతలు గురించ వై చీపి తక్కువ మాట్లాడితే మంచిది.

    1. ఇక పోతే అస్మితారెడ్డి ఇష్యూ ..ఇసుక మాఫియా ట్రిప్పర్ల అడ్డుకోవాలని సిఐ కి ఫోన్ చేయగా నువ్వు చెబితే కేసు పెట్టాల అని నిర్లక్ష్యంగా మాట్లాడిన సీఐ ఇసుక మాఫియా CI లక్ష్మీ కాంత్ రెడ్డి ని వెంటనే సస్పెండ్చేయాలి .. జరిగింది ఇది .

    2. ఇక పోతే అస్మితారెడ్డి ఇష్యూ ..ఇసుక మాఫియా ట్రిప్పర్ల అడ్డుకోవాలని సి ఐ కి ఫోన్ చేయగా నువ్వు చెబితే కే సు పెట్టాల అని నిర్లక్ష్యంగా మాట్లాడిన సీ ఐ ఇసుక మా ఫి యా CI లక్ష్మీ కాంత్ రెడ్డి ని వెంటనే సస్పెండ్చేయాలి .. జరిగింది ఇది .

Comments are closed.