ఉత్తరాంధ్రాలో అతి పెద్దదైన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుగా రూపుదిద్దిన భోగాపురంలోని విమానాశ్రయానికి ఎట్టకేలకు మోక్షం కలుగుతోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. దాదాపుగా రెండు వేల అయిదు వందల ఎకరాల విస్తీర్ణంతో భోగాపురం ఎయిర్ పోర్టు త్వరలో నిర్మాణం కానుంది. దీనిని సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి అయింది. గతంలో చంద్రబాబు ఒకసారి భోగాపురం ఎయిర్ట్ పోర్టుకు శంకుస్థాపన చేశారు. కానీ అది అక్కడితోనే ఆగింది.
భూసేకరణ పూర్తి కాకపోవడంతోనే అసలు సమస్య నాడు ఎదురైంది. ఇపుడు తొంబై శాతం పైగా భూ సేకరణ పూర్తి అయింది. మిగిలినది కూడా రెడీ చేసి తొందరలోనే భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి జగన్ చేతుల మీదుగా శ్రీకారం చుడతారు అని అంటున్నారు.
దీనికి సంకేతంగా విశాఖపట్నం ఎయిర్ పోర్టును కూడా అక్కడికి తరలించేందుకు నావికాదళంసైతం అంగీకరించడం జరిగింది. ఇక యుద్ధ ప్రాతిపదకన రెండేళ్ల వ్యవధిలోనే భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.
ఇక ఇక భోగాపురంలో సేకరించిన కొన్ని భూములపై న్యాయస్థానాలలో నమోదైన కేసులపై త్వరలోనే తీర్పు రానుందని అధికార వర్గాలు చెబుతున్నారు. అది జరిగిన వెంటనే అన్ని అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి. దాంతో భోగాపురం ఎయిర్ పోర్టుకు జగన్ చేత శంకుస్థాపన చేయాలని అధికారులు భావిస్తున్నారు.