గుడివాడకు పెద్ద బాధ్యతలు

యువ మంత్రి గుడివాడ అమరనాధ్ కి పెద్ద బాధ్యతలు అప్పగించింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రపతి హోదాలో మొదటిసారి విశాఖ వస్తున్న ద్రౌపది ముర్ము కొన్ని గంటల పాటు సిటీలో ఉంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో…

యువ మంత్రి గుడివాడ అమరనాధ్ కి పెద్ద బాధ్యతలు అప్పగించింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రపతి హోదాలో మొదటిసారి విశాఖ వస్తున్న ద్రౌపది ముర్ము కొన్ని గంటల పాటు సిటీలో ఉంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ప్రత్యేకించి నేవీ డేకి ఆమె ముఖ్య అతిధిగా హాజరవుతారు.

విశాఖలో రాష్ట్రపతికి స్వాగతం పలకడం నుంచి మొత్తం ఆమె అధికారిక పర్యటన బాధ్యతలు అంతా గుడివాడ అమరనాధ్ చూసుకుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బదులుగా గుడివాడ ఈ బాధ్యతలను నిర్వహిస్తారు అన్న మాట. రాష్ట్రపతి విజయవాడలో జగన్ స్వాగతం పలుకుతున్న నేపధ్యంలో విశాఖకు ఆయన బదులుగా గుడివాడ వ్యవహరిస్తారు అన్న మాట. అలా ఆయనకు మినిస్టర్ ఇన్ వెయిటింగ్ హోదాను ప్రభుత్వం కట్టబెట్టింది.

ఆయనకు అరుదైన గౌరవాన్ని ఈ విధంగా రాష్ట్రప్రభుత్వం కల్పించింది. మంత్రి అయి ఎనిమిది నెలలు అయింది. కీలకమైన శాఖలు ఆయన చూస్తున్నారు. ఉత్తరాంధ్రాలో ఎంతో మంది సీనియర్ మంత్రులు ఉండగా గుడివాడనే ఎంచుకుని మరీ ఈ బాధ్యతలు అప్పగించారు అంటే యువ మంత్రికి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటి అన్నది అర్ధమవుతోంది అంటున్నారు.

వైసీపీ ప్రభుత్వం లో నోరున్న మంత్రిగా జిల్లా రాజకీయాలో పేరున్న నేతగా ఉన్న గుడివాడ మూడున్నర పదుల వయసులోనే అన్నింటా కీలకంగా మారారు. పక్కా లోకల్ అంటూ విశాఖలో రాజకీయాలు చేస్తున్న ఈ యువ మంత్రి కొత్త ఏడాదిలో కూడా పెట్టుబడుల సదస్సుని విశాఖ పెట్టడం ద్వారా తన ఇమేజ్ ని మరింతగా పెంచుకోనున్నారు అని అంటున్నారు.