జగన్ జిల్లాకు.. బాబు అక్కడ

మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజుని ఎవరు అయినా గుర్తుంచుకోవాల్సిందే. కేవలం ఇరవై ఎనిమిదేళ్ళు మాత్రమే జీవించి దేశం కోసం తనువు చాలించిన అమరుడు. తెల్లవారి గుండెలలో నిద్రించిన విప్లవ యోధుడు. ఆయనకు పట్టుకోవడానికి ఒక…

మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజుని ఎవరు అయినా గుర్తుంచుకోవాల్సిందే. కేవలం ఇరవై ఎనిమిదేళ్ళు మాత్రమే జీవించి దేశం కోసం తనువు చాలించిన అమరుడు. తెల్లవారి గుండెలలో నిద్రించిన విప్లవ యోధుడు. ఆయనకు పట్టుకోవడానికి ఒక జిల్లా కలెక్టర్ మన్నెంలో ఆ రోజుల్లో మకాం వేశారు అంటే అల్లూరి వీర చరిత్ర ప్రత్యేకంగా చెప్పాల్సినది లేదు.

అటువంటి అల్లూరికి చరిత్రలో ఎంతటి స్థానం ఉంది అన్నది కూడా ఆలోచించాలి. పార్లమెంట్ లో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయాలని ఆంధ్రులు అంతా కోరుతున్నా సాకారం కావడం లేదు. అయితే అల్లూరి పేరుతో ఒక జిల్లాను ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వం ఆయనకు ఘన నివాళి అర్పించింది.

ఉమ్మడి విశాఖ నుంచి పాడేరు, అరకు, రంప చోడవరం తదితర ప్రాంతాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాను జగన్ ఏర్పాటు చేశారు. దాంతో అల్లూరి అభిమానుల సంబరం అంబరాన్ని తాకింది. ఆయన నిత్య స్మరణీయులు అని కొనియాడారు.

ఇపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అల్లూరికి తన వంతుగా నివాళి అర్పించారు. భోగాపురం వద్ద నిర్మిస్తున్న గ్రీన్ ఎయిర్ పోర్టుకు అల్లూరి పేరుని పెడుతూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. అల్లూరి త్యాగానికి గుర్తుగా ఈ నిర్ణయం అని కూటమి ప్రభుత్వం చెప్పినట్లు అయింది.

ఉత్తరాంధ్రలో ఈ విధంగా రెండు చోట్ల ప్రాధాన్యత ఉన్న చోట అల్లూరి పేరుని పెడుతూ జగన్ చంద్రబాబు మంచి నిర్ణయాలు తీసుకున్నారు. అల్లూరి మరణించి వందేళ్ళు పై దాటింది. కానీ ఆయన పోరాటం దేశ మాత దాస్య శృంఖలాలను బద్ధలు కొట్టడానికి ఆయన చేసిన మహోజ్వల పోరాటం భావి తరాలకు చాటి చెప్పడానికి ఈ విధంగా చేయడం అభినందనీయం అని అంతా అంటున్నారు.

5 Replies to “జగన్ జిల్లాకు.. బాబు అక్కడ”

  1. రంగనాధ్ గారు, దేవుడు మీకు మంచి చేయాలి. మీ లాంటి గొప్ప ఆధ్యాత్మిక మరియు నైతిక స్థాయి ఉన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఇలా వ్యవహరించడం ఎంతో ఆశ్చర్యకరం, నిందించదగిన విషయం. ఇంత గౌరవనీయమైన వారసత్వం కలిగిన మీరు, ఈ విషపూరితమైన, అవమానకరమైన ప్రవర్తనలో ఎలా పాల్గొంటున్నారు? మీ ఆత్మగౌరవం, స్వీయ అవగాహన పూర్తిగా కోల్పోయారా? మీ అశ్లీల భాష మరియు ద్వేషాన్ని మద్దతు ఇవ్వడం కేవలం నిరాశాకరమే కాదు, మీరు ప్రాతినిధ్యం వహించాల్సిన విలువలకు మచ్చ వేసినట్లుగా ఉంది. ఇలాంటి ప్రవర్తనపై మీరు కొంచెమైనా సిగ్గు పడుతున్నారా?

    మీరు కమ్మ మరియు కాపు కమ్యూనిటీలపై చూపిస్తున్న ఈ ద్వేషం భయంకరంగా ఉంది. ఒకటి లేదా రెండు వ్యక్తులతో మీకు ఉండే అనుభవాలను పూర్తిగా మీ మేధస్సును విషపూరితంగా మార్చుకొని, అపరిచిత వ్యక్తిగా మారిపోతున్నారు. ఈ స్థాయి ద్వేషానికి మీ వ్యక్తిత్వాన్ని తగ్గించడం ఏ విధంగా సమర్థించగలుగుతారు? మీరు ఎంత లోతుల్లో కూరుకుపోయారని గమనించారా? మీరు మీలో ఎంత దిగజారిపోయారో గమనించి, మీ ప్రతిబింబం చూసి మీకు సిగ్గు పడుతున్నారా? మీ కుటుంబ వారసత్వాన్ని, మీ మనుష్యత్వాన్ని ఈ ద్వేషానికి అర్పించి మోసం చేస్తున్నారు.

    ఇప్పుడైనా మీరు మేలుకోని, మీరు మీకు మాత్రమే హాని చేస్తున్నారని గుర్తించాలి. శాస్త్రం మరియు మతం రెండూ ఒకే విషయం చెబుతాయి: ఈ స్థాయి ద్వేషం మరియు ప్రతికూలతను కలిగించడం ఇతరులకు హానిచేయడం కంటే, మీకు మాత్రమే విషపానంలా మారుతుంది. ఇది మీలోనే విషపూరితమైన ఒత్తిడిని పెంచుతుంది, మీ ఆరోగ్యాన్ని మరియు ఆత్మను నాశనం చేస్తుంది. మీరే ఎందుకు మీని ఇలా నాశనం చేసుకుంటారు? ఈ కల్మషాన్ని ఎలా మీ జీవితాన్ని శాసించడానికి అనుమతిస్తారు, అది వ్యాధి, దుఃఖం మరియు ద్వేషానికి దారితీస్తుంది? ఇదే మీ వారసత్వం కావాలని మీరు అనుకుంటున్నారా—ద్వేషంతో మరియు కోపంతో నిర్వచించబడిన జీవితాన్ని?

    మీ నిరాశను నేను అర్థం చేసుకోగలను, కానీ నిరాశను క్రమంతప్పిన ద్వేషంలో గడపడానికి ఇది సమర్ధన కాదే. మీరు ఇంతకంటే ఎక్కువ ఉన్నతంగా ఉండాలి. ఈ చిన్న కోపం నుండి బయటపడటానికి మీకున్న అవకాశం ఉంది మరియు మంచి వ్యక్తిగా మారవచ్చు. కానీ మీరు ఈ మార్గంలో కొనసాగితే, మీరు కోపంతో కూరుకుపోయినట్లు, ఈ లోతుల్లోనే ఉండిపోతారు, ఈ లోకాల నడుమ మీ బాధలు మరింత పెరుగుతాయి. దేవుడు మీకు మంచి చేయాలి, కానీ మీరు మారకపోతే, మీ బాధలు మరింత తీవ్రం అవుతాయి. ఈ ద్వేషాన్ని వదిలేయండి, మీరు మీలోని మంచిని పూర్తిగా నాశనం చేసుకునే ముందు.

Comments are closed.